అఖిల్‌ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' రివ్యూ

First Published | Oct 15, 2021, 1:57 PM IST

బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించిన  ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’  రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ దసరా కానుకగా 15వ తేదీ జనం ముందుకొచ్చింది.


 కథేంటి

న్యూయార్క్ లో ఫైనాన్సియల్ గా వెల్  సెటిల్ట్  హర్ష (అఖిల్) ఇండియాకు వస్తాడు. ఇరవై రోజుల్లో పెళ్ళి సెట్ చేసుకోవటానికి హైదరాబాద్ వస్తాడు. ఆ ప్రాసెస్ లో చాలా మంది అమ్మాయిలను పెళ్లి చూపులు చూస్తాడు. ఆ పెళ్లి కూతుళ్లలో విభ(పూజ) ఒకరు. ఆమె ఓ స్టాండ్ అప్ కమిడియన్. ఇండిపెండెంట్ ఉమెన్. ఆమెకు లైఫ్ పార్టనర్ విషయమై చాలా ఆలోచనలు, ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. హర్ష సంప్రదాయ బద్దంగా వెళ్దామనుకునే క్యారక్టర్.  మొదట ఆమెను చూసి ఇష్టపడినా , ఆమె అభిప్రాయాలతో విభేదిస్తాడు..వద్దనుకుంటాడు. ఆమె కూడా అతనికి నో చెప్పేస్తుంది. ఆ తర్వాత అమెరికా వెళ్లిపోతాడు. మర్చిపోదామనుకుంటాడు. కానీ అతని వల్ల కాదు. ఆమె అతని ఆలోచనలు మొత్తం ఆక్రమించేస్తుంది. ఈ లోగా ఇంట్లో వాళ్లు మరొక అమ్మాయితో అతని పెళ్లి సెట్ చేసేస్తాడు.  అప్పుడు హర్ష ఏం డెసిషన్ తీసుకున్నాడు. విభ మనస్సు ఎలా గెలుచుకున్నాడు. ఆ క్రమంలో ఏం జరిగింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎనాలసిస్ ..
మనకు తెలుగులో రొమాంటిక్ కామెడీలు బాగా తక్కువ. అప్పుడప్పుడూ వస్తూంటాయి. అయితే అవి ప్యూర్ రొమాంటిక్ కామెడీలు అని చెప్పలేం. ఎందుకంటే వాటిల్లో యాక్షన్ మిక్స్ అయ్యి ఉంటుంది. మరొకటి ఏదో కలిపేస్తాడు.కిచిడి చేసేస్తారు. అయితే ఓ అబ్బాయి, అమ్మాయి..వాళ్ళ అభిప్రాయ భేధాలు, విడిపోవటం..ఆ తర్వాత ఒకరినొకరు పొందటం అనేది స్పెషల్ గా చూపించరు. అయితే ఈ సినిమాలో ఆ ప్రయత్నం చేసారు. కానీ కామెడీ కోసం కొన్ని సార్లు ప్రక్కకు వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది. అలాగే సెకండాఫ్ లో హీరో అమెరికా వెళ్లిపోయాక వచ్చే సీన్స్ కూడా అంత ఇంప్రెసివ్ గా ఉండవు.  ఈ కాలంలో యూత్ ఆలోచనలు ఎక్కువగా రిప్రెజెంట్ చేసే ప్రయత్నం చేసారు. న్యూ జనరేషన్ పెళ్లి నుంచి ఏం ఎక్సపెక్ట్ చేస్తోంది అనేది పెద్లుకు అర్దమయ్యేలా చెప్పారు. అయితే సినిమా ప్రారంభం మాత్రం చాలా రొటీన్ గా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. 


Most Eligible Bachelor


భాస్కర్ లో బొమ్మరిల్లు నాటి మ్యాజిక్ మిస్సైందనిపిస్తుంది. అలాగే స్టోరీ లైన్ గా చూస్తే  రీసెంట్ గా వచ్చిన షాదీ ముబారక్ ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది. ఓ ఎన్నారై పెళ్లి కొడుకు ఇండియాకు వచ్చి ఇక్కడ పెళ్లి సంభందాలు చూసి ఓ అమ్మాయిని తనకు పార్టనర్ గా ఫైనలైజ్ చేసుకునే ప్రాసెస్ లో హీరోయిన్ తో ప్రేమలో పడటం జరగటం ఇందులో సిమిలర్ గా ఉంటుంది. ఇక ఫన్ సైడ్ చూస్తే ఫస్టాఫ్ లో బాగానే వర్కవుట్ అయ్యిందని చెప్పాలి. అయితే అన్ని ఫన్ సీన్స్ బాగా నవ్వించలేకపోయాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే కోర్ట్ సీన్ అయితే చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ లో వచ్చే బిజినెస్ డీలింగ్ సీన్స్ కూడా అంతే. చాలా సిల్లీగా తీసారు.


  ఆ తర్వాత వచ్చే ఎంగేజ్మెంట్ సీన్ అయితే బాగా ఫోర్సెడ్ గా అనిపిస్తుంది. అలాగే వెన్నెల కిషోర్ తో చేసే కామెడీ చాలా డ్రైగా అనిపించింది. డైరక్టర్ ఈ థిన్ లైన్ స్టోరీ లైన్ లో చేసిన గొప్పపని ఏమిటీ అంటే చాలా భాగం ఏదో ఒక కంటెంట్ తో ఎంగేజ్ చేసే ప్రయత్నం చేయటం. అదే ప్లస్ అయ్యింది. కాకపోతే సినిమాలో ఎక్కువ శాతం పూర్తిగా కాన్వర్షేషన్స్ మీద ఆధారపడిపోయారు. ముఖ్యంగా క్లైమాక్స్ మరీను. దాంతో ఏదో స్పీచ్ వింటున్నట్లుగా అనిపించినా ఆశ్చర్యం లేదు.  ఎ, మల్టిఫ్లెక్స్ ఆడియన్స్ బాగా నచ్చే అవకాసం ఉంది. బి,సి సెంటర్లు కష్టమే. అది జరిగినా అఖిల్ కెరీర్ కు ప్లస్సే.
 

ప్లస్ పాయింట్స్ :
అఖిల్, పూజా పెయిర్ 
పూజా హెగ్డే పర్ఫార్మెన్స్
మ్యూజిక్
క్లైమాక్స్ డైలాగులు
ఫన్

మైనస్ పాయింట్స్

సెకండ్ హాఫ్ లో లాగ్ సీన్స్
పెద్దగా కథలో ఏమీ జరిగినట్లు అనిపించకపోవటం
అమెరికా ఎపిసోడ్ సిల్లీగా ఉండటం


టెక్నికల్ గా...
రొమాంటిక్ కామెడీలకు అవసరమైన లైటింగ్, కెమెరా వర్క్, మ్యూజిక్ ఈ సినిమాకు ఫెరఫెక్ట్ గా సెట్ అయ్యాయి. గోపిసుందర్ సినిమాకు అర్బన్ ప్లేవర్ అద్దారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్ కు ప్లస్ అయ్యింది. విజువల్స్ చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి. సెకండాఫ్ లో లాగ్ లు తొలిగించేలా ఎడిటింగ్ ఉంటే బాగుండేది. రైటింగ్ సైడ్ లో డైలాగులు బాగున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ ని బాగా డిజైన్ చేసారు. డైరక్టర్ గా బొమ్మరిల్లు భాస్కర్ ..అద్బుతం కాదు కానీ నడిపేసారు.  ఆర్ట్ డైరెక్టర్ అవినాశ్ కొల్లా పనితనం బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఫస్ట్ క్లాస్! 

Most Eligible Bachelor

నటీనటుల్లో ..
అఖిల్ వయస్సుకు తగ్గ పాత్ర కావటంతో ఎక్కడా ఇబ్బంది అనిపించలేదు. కామెడీ సీన్స్ లో కూడా బాగా రాణించాడు. పూజా కు ఈ సినిమాకు వెన్నుముక లాంటి పాత్ర దొరికింది. ఆమెలోని గ్లామర్ ని కాకుండా నటిని ఆవిష్కరించే అవకాసం దొరికింది. కానీ గ్లామరే ఎక్కువ డామినేట్ చేసింది. హీరోయిన్ తండ్రిగా మురళీ శర్మ రొటీన్ క్యారక్టర్. ఆయన పాత్రలో  పెద్దగా డైమన్షన్స్ కూడా లేవు. ఆయన భార్యగా ప్రగతి బాగా చేసారు. సుడిగాలి సుధీర్, వెన్నెల కిషోర్, పోసాని,రాహుల్ రవీంద్రన్, చిన్నమయి వంటివారు ఉన్నా గుర్తుపెట్టుకునే పాత్రలేమీ కావు. 

MOST ELIGIBLE BACHELOR

ఫైనల్ ధాట్
హిట్ కోసం ఎన్నో సంభంధాలు చూస్తున్న  'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' కు ఈ సారి పిల్ల దొరికినట్లే కనిపిస్తోంది
Rating : 2.75/5 
---సూర్య ప్రకాష్ జోశ్యుల

Latest Videos

click me!