పొడవాటి జుట్టు, దట్టమైన గడ్డంతో మూర్తి పాత్రలో శరత్‌కుమార్ జీవించేశారు. ఎక్కువ డైలాగ్స్ లేకుండా, బాడీ లాంగ్వేజ్‌తోనే క్రూరత్వాన్ని పండించారు. హీరోగా నటించిన ఇంద్రజిత్ జగజిత్ కూడా అద్భుతంగా నటించాడు. శరత్‌కుమార్‌తో పోటీపడి యాక్షన్ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. దేవిక సతీష్, వైయాపురి, శ్రీజిత్ రవి, బిర్లా బోస్ తమ పాత్రలకు న్యాయం చేశారు.