
ప్రస్తుత కాలంలో చాలా మంది ఆడవారు హెయిర్ ఫాల్ సమస్యను ఫేస్ చేస్తున్నారు. జుట్టు రాలడాన్ని ఆపడానికి రకరకాల నూనెలు, షాంపూలు, హెయిర్ మాస్క్ లు, మందులు లేదా చికిత్సలను ప్రయత్నిస్తుంటారు. దీనికంటే ముందు అసలు జుట్టు ఎందుకు రాలుతుంతో దెలుసుకుంటే దీన్ని ఆపడం సులువు అవుతుందంటున్నారు నిపుణులు. ఒత్తిడి లేదా జెనెటిక్స్ లేదా కాలుష్యం వంటి వివిధ కారణాల వల్ల కూడా జుట్టు రాలుతుది. అంతేకాదు విటమిన్ల లోపంతో కూడా జుట్టు రాలుతుందని నిపుణులు అంటున్నారు.
విటమిన్లు, ఖనిజ లోపాలు కూడా జుట్టు రాలడానికి దారితీస్తాయి. జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్లు, ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలో ఈ విటమిన్లు, ఖనిజాలు లోపిస్తే జుట్టు విపరీతంగా రాలుతుందని నిపుణులు అంటున్నారు.
మన జుట్టుకు 13 ముఖ్యమైన విటమిన్లు అవసరమవుతాయి. విటమిన్ బి 12, విటమిన్ డి 3 లోపాలు ప్రధానంగా జుట్టు రాలడానికి కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్ ను తీసుకువెళ్లే ఎర్ర రక్త కణాలు విటమిన్ బి 12 తో సులభతరం అవుతాయి. మీ శరీరంలో విటమిన్ బి 12 స్థాయిలు తగినంతగా లేకపోతే మీ హెయిర్ ఫోలికల్స్ కొత్త జుట్టు ఉత్పత్తి చేయలేవు. దీనివల్ల జుట్టు రాలడం మొదలవుతుంది. విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ సి వంటి ఇతర విటమిన్ల లోపాలు కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి విటమిన్లు సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
విటమిన్ ఇ ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇది నెత్తిమీద రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుం. అలాగే జుట్టు బలంగా పెరిగేందుకు సహాయపడుతుంది. ఇకపోతే విటమిన్ సి కొల్లాజెన్ సంశ్లేషణకు సహాయపడుతుంది. ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. గట్ నుంచి ఇనుము శోషణలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే మీ శరీరానికి విటమిన్ సి చాలా అవసరం. ముఖ్యంగా ఇనుము లోపం వల్ల జుట్టు రాలకుండా ఉండటానికి.
విటమిన్ డి "సన్ షైన్ విటమిన్" అని అందరికీ తెలుసు. ఎందుకంటే దీన్ని చర్మం సూర్యరశ్మికి గురైనప్పుడు శరీరం ఉత్పత్తి చేస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాలు, సప్లిమెంట్ల ద్వారా ఈ విటమిన్ ను పొందొచ్చు. హెయిర్ ఫోలికల్ పెరుగుదలను ప్రోత్సహించడానికి, ఆరోగ్యకరమైన హెయిర్ ఫోలికల్స్ ను నిర్వహించడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. అయినప్పటికీ విటమిన్ డి సప్లిమెంట్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం పేరుకుపోతుంది. ఇది జుట్టు రాలడానికి దారితీస్తుంది.
జుట్టు ఆరోగ్యానికి విటమిన్లతో పాటుగా ఖనిజాలు కూడా అవసరమే. ఐరన్, జింక్, సెలీనియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు కుదుళ్లు దెబ్బతినకుండా రక్షించే యాంటీ ఆక్సిడెంట్ల సంశ్లేషణకు సెలీనియం సహాయపడుతుంది. ప్రోటీన్ సంశ్లేషణకు మెగ్నీషియం చాలా అవసరం. ఇది జుట్టును పెంచేందుకు సహాయపడుతుంది. ఇనుము లోపం రక్తహీనతకు దారితీస్తుంది. ఇది జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్ సరఫరా తగ్గితే జుట్టు రాలుతుంది. జింక్ లోపం కూడా జుట్టు రాలడానికి దారితీస్తుంది. ఎందుకంటే ఇది జుట్టు కణాల ఉత్పత్తి, మరమ్మత్తుకు సహాయపడుతుంది. దీని లోపం జుట్టు సన్నబడటానికి, జుట్టు రాలడానికి దారితీస్తుంది.
విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే జుట్టు రాలే అవకాశం ఉండదు. అయితే మీరు జుట్టు రాలడానికి అసలు కారణాన్ని తెలుసుకోవడానికి ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాలి.