భారతీయ ఆహారంలో పప్పుధాన్యాలు చాలా ముఖ్యమైనవి. పప్పులతో సాంబారు, కూర, టొమాటో పప్పు మొదలైన ఆహారాన్ని తయారు చేసుకుని తింటుంటారు. పప్పుధాన్యాలు ప్రతి వంటగదిలో తప్పకుండా ఉంటాయి. ఇవి కేవలం రుచికే కాదు.. వీటిలో ప్రోటీన్లు, పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందుకే వీటిని ఎప్పుడూ వంటగదిలో ఉండేలా చూసుకుంటారు. అయితే కొంతమంది మాత్రం అవసరమైన దానికంటే ఎక్కువ మొత్తంలో కొనేస్తుంటారు. ధరలు మారుతూ ఉంటాయని.. వర్షాకాలంలో తరచుగా బయటకు వెళ్లలేమని.. వంటి వివిధ కారణాల వల్ల పప్పుధాన్యాలను పెద్దమొత్తంలో కొనుగోలు చేసి నిల్వ చేస్తారు.