గోర్లపై తెల్ల మచ్చలు ఉంటే ఏమౌతుందో తెలుసా?

First Published Apr 9, 2024, 4:40 PM IST

చాలా మందికి గోర్లపై తెల్లమచ్చలు ఉంటుంటాయి. అయితే వీటి గురించి చాలా మంది పట్టించుకోరు. ఇవి కామన్ అని అనుకుంటుంటారు. కానీ జ్యోతిష్యం ప్రకారం.. ఇవి కూడా మనకు ఎన్నో సంకేతాలను ఇస్తాయి. అవేంటంటే?

ఓషనోగ్రఫీలో.. శరీరంపై ఉన్న పుట్టుమచ్చల నుంచి గోర్ల ఆకృతి వరకు.. ప్రతి ఒక్కటీ ఒక వ్యక్తి భవితవ్యాన్ని నిర్ధారిస్తుంది. అయితే చాలా మందికి గోర్లపై తెల్ల మచ్చలు ఉంటాయి. వీటి గురించి పట్టించుకునేవారు చాలా తక్కువ. కానీ గోర్లపై ఉండే తెల్లని మచ్చలు శుభ, అశుభ ఫలితాలను సూచిస్తాయట. మరి గోర్లపై తెల్ల మచ్చలు ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

వ్యాపారంలో పురోగతి 

ఓషనోగ్రఫీ ప్రకారం.. బొటనవేలు గోరుపై తెల్లని గుర్తు ఉన్న వ్యక్తికి అంతే మంచే జరుగుతుంది. ముఖ్యంగా ఈ వ్యక్తుల క్రయవిక్రయాల వ్యాపారంలో చాలా పురోగతి సాధిస్తాడు. ఈ వ్యక్తులకు వ్యాపారంలో తిరుగు ఉండదు. 
 

స్నేహంలో నిపుణుడు

బొటనవేలుపై తెల్లని మచ్చలున్నవారు చాలా లక్కీ. ఇలాంటి తెల్లని మచ్చలున్నవారు స్నేహంలో మంచి నిపుణులు. అలాగే ఇలాంటి వాళ్లకు మంచి స్నేహితులు కూడా దొరుకుతారు.

గౌరవం లభిస్తుంది

చూపుడు వేలు అంటే బొటనవేలు పక్కన వెలి గోరుపై తెల్లని మచ్చలున్న వ్యక్తికి సమాజంలో ఎంతో గౌరవం లభిస్తుంది. వీరికి సమాజంలో కీర్తిప్రతిష్టలు, మర్యాదలు దక్కుతాయి. ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతారు. 
 

డబ్బుకు కొదవలేదు

గోర్లపై తెల్లని మచ్చలున్న వారికి డబ్బుకు కొదవ ఉండదని ఓషనోగ్రఫీలో ఉంది. ఇలాంటి వారిని ఎంతో అదృష్టవంతులుగా భావిస్తారు. వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. 

రోమింగ్ అంటే ఇష్టం

మధ్య వేలి గోరుపై తెల్ల మచ్చ ఉన్న వ్యక్తులను ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఇలాంటి వ్యక్తులకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అలాగే వీళ్లు ప్రయాణాల ద్వారా మాత్రమే డబ్బు సంపాదిస్తారు. వీరికి ప్రయాణాలు చేయడంలో ఎలాంటి ఇబ్బంది కలగదు. 

వారు అదృష్టవంతులు

చిటికెన వేళుపూ తెల్ల మచ్చ ఉన్నవారు చాలా చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. ఇలాంటి వ్యక్తులు వ్యాపారంలో ఎంతో పురోగతిని సాధిస్తారు. వ్యాపారం ద్వారా ఎంతో సంపాదిస్తారు. కీర్తి ప్రతిష్టలు దక్కించుకుంటారు. 

పేలవమైన ఆరోగ్యం 

సైన్స్ పరంగా మాట్లాడితే గోర్లపై తెల్లని మచ్చలు రావడానికి కారణం శరీరంలో పోషకాలు లోపమే కారణమని నిపుణులు అంటున్నారు. మీరు ఆహారంలో ప్రోటీన్, కాల్షియం, జింక్ లోపించడం వల్ల గోర్లపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి.

click me!