ఇంట్లో ఉండేవారు బరువు తగ్గడానికి ఏం చేయాలో తెలుసా?

First Published May 25, 2024, 10:00 AM IST

నిశ్చల జీవన శైలి వల్ల బరువు పెరిగిపోవడం చాలా కామన్. బరువు తగ్గాలంటే మాత్రం వ్యాయామాలు చేయాలి. అయితే చాలా మంది ఆడవారికి ఇంటి నుంచి బయటకు వెళ్లే అలవాటు ఉండదు. బరువు తగ్గాలంటే మీరు జిమ్ కే వెళ్లాల్సిన అసవరం లేదు. ఇంట్లో ఉంటూనే ఎంచక్కా బరువు తగ్గొచ్చు. అదెలాగంటే? 
 

ప్రస్తుత కాలంలో యువతలో ఊబకాయం సమస్య బాగా పెరుగుతోంది. దీనికి అసలు కారణం అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడమే. అయితే చాలా మందికి జిమ్ కుస వెళ్లే ఇంట్రెస్ట్ అసలే ఉండదు. అలాగే డైట్ ఫాలో అయ్యే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఈ రెండూ లేకుండా బరువు తగ్గడం ఇంపాజిబుల్ అనుకుంటారు చాలా మంది. కానీ జిమ్ కు వెళ్లకున్నా, డైట్ ఫాలో కాకున్నా.. ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు. అదెలాగంటే? 
 

విండో క్లీనింగ్

ఇంట్లో ఉంటూ బరువు తగ్గడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. వీటిలో విండో క్లీనింగ్ ఒకటి. ఇంటి కిటికీలను కనీసం ఒక గంట పాటు శుభ్రం చేస్తే మీరు సుమారుగా 170  నుంచి 250 కేలరీలను సులభంగా తగ్గించొచ్చు. అందుకే వారానికి రెండు, మూడు సార్లు మీ ఇంటి కిటికీలను శుభ్రం చేయండి. ఇది మీకు మంచి వ్యాయామం అవుతుంది. 
 

Latest Videos


పెయింటింగ్

మీ ఇంటి గోడలపై పెయింటింగ్ వల్ల కూడా మీరు ఈజీగా బరువు తగ్గొచ్చు. ఇది గంటకు 383 కేలరీలను తగ్గిస్తుందని వైద్య అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలాగే పెయింట్ బ్రష్ ఉపయోగించడానికి బదులుగా రోలర్ ను ఉపయోగించండి. దీనికి ఎక్కువ శ్రమ అవసరమవుతుంది కాబట్టి మీరు ఈజీగా బరువు తగ్గొచ్చు. 
 

వేడి నీటి స్నానం

మన శరీరంలోని కేలరీలను బర్న్ చేయడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి  వేడి నీటి స్నానం బాగా ఉపయోగపడుతుంది. సుమారుగా ఒక గంట పాటు వేడినీటిలో స్నానం చేస్తే 25 నుంచి 30 నిమిషాల నడకతో సమానమని చెబుతారు.
 

గార్డెనింగ్

గార్డెనింగ్ పనులు ఎంత చేసినా విసుగు రాదు. నిజానికి ఇది మనసుకు ఆనందాన్ని కలిగించడమే కాకుండా శారీరక ఆరోగ్యానికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే  మీ ఇంట్లో పెరట్లో గార్డెన్ ను ఏర్పాటు చేయండి. దానిలో మొక్కలకు రోజూ కనీసం 30 నిమిషాల పాటైనా నీళ్లు పోయండి. దీనివల్ల మీ శరీరం నుంచి 200 కేలరీలు తగ్గుతాయి. గార్డెనింగ్ మీ బరువును తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. 
 

బట్టలు ఉతకడం 

వాషింగ్ మెషీన్ రాకతో చాలా మంది బట్టలను చేతులతో ఉతకడమే మర్చిపోయారు. కానీ చేతులతో దుస్తులు ఉతకడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. యంత్రాలపై ఆధారపడకుండా చేతులతో బట్టలు ఉతకడం, బట్టలు మడతపెట్టడం వంటి పనులు చేయడం వల్ల గంటకు 78 కేలరీలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
 

click me!