కిరాణా సరుకులకు ఖర్చు ఎక్కువ అవుతోందా? ఈ చిట్కాలతో ఖర్చును తగ్గించుకోండి

First Published | Mar 29, 2024, 3:05 PM IST

ఒకటి కొనాలని వెళ్లి వంద కొనేవారు చాలా మందే ఉన్నారు. కానీ అవసరం ఉన్నవి లేనివీ కొనడం వల్ల డబ్బు బాగా ఖర్చు అవుతుంది. అసలు కిరాణా సరుకులను తక్కువ ఖర్చులో కొనాలంటే ఏం చేయాలో తెలుసా? 

ప్రస్తుత కాలంలో ఏదీ తక్కువ ధరకు రావడం లేదు. కానీ ప్రతిదాన్ని ఎక్కువ డబ్బు పెట్టి కొంటే మీ సంపాదనంతా ఖర్చులకే పోతుంది తప్ప కూడదు. ముఖ్యంగా కిరాణా సరుకులకు బాగా ఖర్చు అవుతుంటుంది. ఉల్లి, టమాటాలు, వెల్లుల్లి, అల్లం వంటి రోజువారీ వంటలకు అవసరమైన నిత్యావసర వస్తువులను కొనడం ఈ రోజుల్లో కష్టంగా మారింది. కానీ మనం ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా తినాలి. అలాగని సంపాదనంతా ఫుడ్ కే పెట్టలేం కదా. అందుకే కిరాణా వస్తువుల ధర మన బడ్జెట్ కు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. అందుకే మన బడ్జెట్ లో కూరగాయలు, కిరాణా వస్తువులను ఎలా కొనాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

కిరాణా దుకాణానికి వెళ్లడానికి ముందు మీరు ముందుగా చేయాల్సిన పని మీకు ఏయే వస్తువులు కావాలో ఒక లీస్ట్ ను తయారుచేసుకోండి. ఎందుకంటే మనం దుకాణానికి వెళ్లి మూడు వస్తువులు కొనాలనుకుంటున్నాం. కానీ దుకాణానికి వెళ్లిన తర్వాత అక్కడున్న వాటిని చూసి పది వస్తువులను కొంటుంటాం. ఇది కామన్ గా జరిగిపోతూ ఉంటుది. కానీ దీనివల్ల మీరు అనుకున్నదానికంటే ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే ముందుగా మీరు కిరాణా దుకాణానికి వెళడానికి ముందు వంటగదిలోకి వెళ్లి ఏం కావాలో చూసుకోండి. అవసరం ఉన్నవాటినే లీస్ట్ లో రాయండి. 
 

Latest Videos


కిరాణా దుకాణానికి వెళ్లే ముందు మీరు కొనాలనుకునే వస్తువులు సరైన ధరకు ఆన్లైన్ లో ఉన్నాయో? లేదో? ఒక సారి చెక్ చేయండి. ఎందుకంటే ఆన్లైన్ లో చాలా వస్తువులను కొంటే ఒక్కోసారి పది శాతం డిస్కౌంట్ ఉంటుంది. ఆన్ లైన్ షాపింగ్ ద్వారా దుకాణానికి రవాణా, పెట్రోల్ ఖర్చులు తగ్గుతాయి. అలాగే సరసమైన ధరలకే వస్తువులను కొనొచ్చు. 
 

మీరు తరచుగా షాపింగ్ చేసేవారైతే.. సబ్ స్క్రైబర్ గా మారండి. చందాదారులకు ధరపై అదనపు డిస్కౌంట్ లేదా ఉచిత డెలివరీ సేవ ఉంటుంది. అలాగే మీరు వారానికి ఒకసారి మాత్రమే కొనుగోలు చేసే వారైతే ప్రాసెస్ చేసిన పండ్లు,  కూరగాయలను కొనండి. దీనివల్ల మీరు కొన్న పండ్లు, కూరగాయలు రెండు రోజులకే పాడవకుండా ఉంటాయి. దీంతో మీ డబ్బు వృధా కాదు.
 

మీరు కొనే వస్తువుల ధరలను బరువుతో పోల్చండి. అంటే కిలో కందిపప్పు ధరను రూ.200గా ఉంటుంది. కానీ అర కిలో రూ.120 లకే వస్తుంది. అందులోనూ కందిపప్పు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కాబట్టి మీరు ఒకేసారి ఒక కిలో కందిపప్పును కొనండి. అయితే బ్రాండ్ ఉత్పత్తులనే కొనడానికి ప్రయత్నించండి. అలాగే ధరలను ఖచ్చితంగా పోల్చండి. 
 

కొన్ని కిరాణా దుకాణాలు కందిపప్పు, కందిపప్పు, మిరపకాయలు, శనగలతో పాటుగా ఎన్నో వస్తువులను ప్యాకేజీలలో విక్రయిస్తాయి. ఇది బ్రాండ్ వస్తువుల ధర కంటే తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటిని కొనాలనుకుంటే మీరు దీన్ని కొంచెం కొని నాణ్యతను చెక్ చేయండి. నచ్చితే తర్వాత ఎక్కువగా కొనొచ్చు. 

మీకు తెలుసా? కిరాణా షాపు ర్యాక్ పై వరుసలో ఎక్కువ ధర వస్తువులను పెడతారు. ఇవే మనకు కనిపిస్తాయి. తక్కువ ధర వస్తువులను కింది వరుసలో ఉంచుతారు. అందుకే చూసి కొనండి. కొన్ని షాపుల్లో నో రిటర్న్స్ అని బోర్డులు పెడతారు. ఆ స్టోరులలో మీరు వస్తువులను కొంటె ఒకటికి రెండు సార్లు వాటి తయారీ తేది, గడువు తేదీని చెక్ చేయండి. 
 

click me!