Ambani School Food: సెలబ్రెటీల పిల్లలు చదివే అంబానీ స్కూల్లో ఎలాంటి ఫుడ్ పెడతారో తెలుసా?

Published : Feb 25, 2026, 05:39 PM IST

 Ambani School Food: బాలీవుడ్ సెలబ్రెటీల చాలా మంది పిల్లలు అంబానీ స్కూల్లోనే చదువుతున్నారు. మరి.. అంత రిచ్ కిడ్స్ చదివే స్కూల్లో పిల్లలకు ఎలాంటి భోజనం పెడతారో తెలుసా? 

PREV
12
అంబానీ స్కూల్...

అంబానీ ఫ్యామిలీకి చెందిన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్కూల్లో బాలీవుడ్ సెలబ్రెటీలు చాలా మంది తమ పిల్లలను చదివించారు. ఇప్పటికీ చదివిస్తున్నవారు కూడా ఉన్నారు. ఐశ్వర్యారాయ్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య బచ్చన్ కూడా ఇదే స్కూల్లో చదువుకుంది. ఈ స్కూల్ కేవలం చదువుకు మాత్రమే కాకుండా, విలాసవంతమైన లైఫ్ స్టైల్, నాణ్యమైన ఆహారానికి కూడా ప్రసిద్ధి చెందింది.

22
అంబానీ స్కూల్లో ఎలాంటి భోజనం పెడతారు..?

ఈ స్కూల్లో పిల్లల ఆరోగ్యానికి కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఫుడ్ మెనూ.. 5 స్టార్ హోటల్ లెవల్ లో రూపొందించారు. ఇక్కడ పిల్లలు ఇంటి నుండి టిఫిన్ బాక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పాఠశాలలో బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందిస్తారు.

సెలబ్రిటీ చెఫ్ సంజీవ్ కపూర్ రూపొందించిన మెనూ..

ఈ స్కూల్లో పూర్తిగా శాఖాహారం, పోషకాలతో నిండిన ఆహారం మాత్రమే అందిస్తారు. ఈ స్కూల్ రెండు ఎయిర్ కండిషన్ డైనింగ్ హాళ్లు ఉన్నాయి.పిల్లలకు అందించే ఆహారాన్ని సెలబ్రిటీ చెఫ్ సంజీవ్ కపూర్ రూపొందించారు. జంక్ ఫుడ్ లేకుండా... బ్యాలెన్స్డ్ మీల్ అందిస్తారు.

బ్రేక్ ఫాస్ట్ లో...

ఇడ్లీ, దోస, ఉత్తప్పం వంటి దక్షిణ భారత ప్రత్యేకతలు ఉంటాయి. దీనితో పాటు పోహా, తాజా పండ్లు , డ్రై ఫ్రూట్స్‌తో కూడిన పోషకమైన అల్పాహారం ఉంటుంది.

లంచ్ లో..

వివిధ రకాల పప్పులు , సీజనల్ వెజిటేబుల్స్ తో పనీర్ సబ్జీ, ఆలూ-గోబీ మొదలైనవి, తాజా చపాతీ, అన్నం, సలాడ్ ఉంటాయి. అంటే భోజనంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ అన్నీ అందేలా జాగ్రత్తలు తీసుకుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories