పడుకొని ఫోన్ చూస్తే ఏమౌతుంది?

First Published Apr 3, 2024, 12:48 PM IST

సెల్ ఫోన్ ను మనం ఎన్నో విధాలుగా ఉపయోగిస్తుంటాం. అంటే నిలబడి, కూర్చొని, పడుకుని వాడుతుంటాం. అయితే పడుకొని ఫోన్ వాడితే ఏమౌతుందో తెలిస్తే మళ్లీ ఆపని జీవితంలో చేయరు. 
 

నేడు పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లకు బానిసలుగా మారిపోతున్నారు. ఒక్క నిమిషం కూడా ఫోన్ లేకుంటే పిచ్చొళ్లు అయ్యేవారు కూడా ఉన్నారు. ఏం నోటిఫికేషన్స్ వచ్చాయని చూస్తేనే ఉంటారు. స్క్రోలో చేస్తూనే ఉంటారు. ఇక ఉదయం నిద్రలేవగానే ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, వాట్సప్ లలో ఎలాంటి మెసేజెస్ వచ్చాయో చెక్ చేస్తుంటారు. కానీ ఫోన్ ను అతిగా వాడితే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. 

చాలా సార్లు మనం కూర్చొని, నిలబడి, పడుకుని, మన సౌలభ్యాన్ని బట్టి మొబైల్ ఫోన్లను చూస్తుంటాం. ఇవి మనకు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ.. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అసలు పడుకునేటప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించడం వల్ల ఎలాంటి  సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


1. చాలా సార్లు పిల్లలు ఫోన్ ను రాత్రిళ్లు చదివిన తర్వాత ఫోన్ చూద్దాంలే అని ఫోన్లను దిండుకింద పెట్టేస్తుంటారు. చదువు అయిపోగానే ఫోన్లను వాడుతుంటారు. కానీ ఇలా ఫోన్ ను చూడటం వల్ల మెడ, కటిలో నొప్పి వస్తుంది. అలాగే కండరాల నొప్పి కూడా వస్తుంది. 

2. కూర్చొని ఫోన్ మనం చూస్తున్నప్పుడు సెల్ ఫోన్ స్క్రీన్ కాస్త దూరంగా ఉంటుంది. కానీ పడుకొని మొబైల్ చూస్తే కళ్లకు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ పొజీషన్ లో ఫోన్ ను చూడటం వల్ల కళ్లు బాగా అలసిపోతాయి. ఇది కళ్లలో తేమను త్వరగా కోల్పోయేలా చేస్తుంది. దీంతో కళ్లు పొడిబారుతాయి. 

3. గంటల తరబడి మొబైల్ ఫోన్లను వాడితే మెడనొప్పి, వెన్నునొప్పి, తుంటి నొప్పి, కంటి కండరాల నొప్పి, భుజం నొప్పి వంటి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. 
 

4. సెల్ ఫోన్ నుంచి వచ్చే విద్యుదయస్కాంత రేడియేషన్ మన శరీరంపై చెడు ప్రభావాలను కలిగిస్తుంది. ముఖ్యంగా వీటివల్ల కంటి చూపు తగ్గుతుంది. వేరే కంటి సమస్యలు కూడా వస్తాయి. అందుకే  మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా వాడండి. మీకు తలనొప్పి ఉన్నా, కంటి చూపు తక్కువగా ఉన్నా ఫోన్లను ఇలా వాడటం మానుకోండి. రాత్రి పడుకునేటప్పుడు మొబైల్ ఫోన్లను ఎక్కువగా చూడకూడదు. ఇది శాశ్వత నిద్ర సమస్యలకు దారితీస్తుంది.
 

నష్టాన్ని నివారించడం ఎలా?

మొబైల్ ఫోన్లను వాడటం వల్ల సమస్యలు రావొద్దంటే అరగంటకు మించి సెల్ ఫోన్లను చూడకుండా ఉండాలి.
మొబైల్ ఫోన్ వాడాల్సి వస్తే ప్రతి 5 నిమిషాలకోసారి కళ్లు రెప్పలు ఆర్పాలి. ఇది మీ కళ్లను తేమగా ఉంచుతుంది. అలాగే కంటి చికాకు రాకుండా చూస్తుంది. 
మీరు మొబైల్స్ ను చూసినప్పుడల్లా, నిటారుగా ముందుకు చూడండి. దీనివల్ల వెన్ను, మెడనొప్పి సమస్యలు రావు. 
కంటిచూపు దెబ్బతినకుండా ఉండాలంటే మొబైల్ ఫోన్ ను కొంత దూరంలో ఉంచాలి. అలాగే ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో  ఏదైనా వస్తువును 20 సెకన్లపాటు చేయా

click me!