ముఖంపై ముడతల నుంచి నల్ల మచ్చల వరకు.. ఈ ఫ్రూట్ ఫేస్ ప్యాక్ తో సమస్య మాయం..!

Published : Jun 19, 2023, 01:20 PM IST

వయసు పెరుగుతున్న కొద్దీ  మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా మన చర్మమే ముందు మారుతుంది. సన్నని గీతలు, ముడతలు, నల్లని మచ్చలు రావడం చాలా కామన్.   

PREV
16
ముఖంపై ముడతల నుంచి నల్ల మచ్చల వరకు.. ఈ ఫ్రూట్ ఫేస్ ప్యాక్ తో సమస్య మాయం..!
Image: Getty

అందమైన చర్మం ప్రతి ఒక్కరికీ ఇష్టమే. ఇందుకోసం ఎన్నో ఎన్నెన్నో చేస్తుంటారు. కానీ వయసు పెరిగేకొద్ది చర్మం అందం తగ్గుతుంది. పటుత్వాన్ని కోల్పోతుంది. మొటిమలు, నల్లటి మచ్చలు, కళ్ల చుట్టూ నల్లబడటం, ముడతలు వంటి ఎన్నో చర్మ సమస్యలు వయసు పెరిగే కొద్దీ వస్తుంటాయి. వృద్ధాప్యాన్ని ఆపలేకపోవచ్చు. మీ చర్మాన్ని రక్షించడానికి కొన్ని చిన్న పనులు సహాయపడతాయి. ముఖంపై ముడతలు,  నల్లటి మచ్చలను తొలగించి ముఖం మెరిసేలా చేయడానికి కొన్ని పండ్లు  ఎంతో సహాయపడతాయి. పండ్లతో తయారు చేసిన కొన్ని ఫేస్ ప్యాక్స్ గురించి మీరూ ఓ లుక్కేయండి..
 

26


ఆఫిల్ ఫేస్ ప్యాక్

ఆపిల్ ఫేక్ మన చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ చర్మంపై ముడతలను తగ్గించి చర్మం అందంగా మెరిసేలా చేస్తుంది. ఇందుకోసం యాపిల్స్, తేనె బాగా మిక్స్ చేసి బీట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.

36

బొప్పాయి ఫేస్ ప్యాక్

బొప్పాయిలో ఎన్నో పోషకాలుంటాయి. దీనిలో ఉండే విటమిన్ ఎ, పాపైన్ ఎంజైమ్ ముఖంపై మృతకణాలను తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. బొప్పాయి ఫేస్ ప్యాక్ ను తయారు చేయడానికి ముందుగా పండిన బొప్పాయిని నాలుగు ముక్కలుగా కట్ చేసి అందులో కొంత భాగాన్ని తీసుకోండి. రెండు టీస్పూన్ల పెరుగును, ఒక టీస్పూన్ తేనెను, బొప్పాయి గుజ్జు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడిగేయండి.
 

46
mango face packs

మామిడి పండ్లు

మామిడి పండ్లలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లు చర్మంపై ముడతలను నివారించడానికి సహాయపడతాయి. ఇందుకోసం ఒక టీస్పూన్ మామిడి గుజ్జును తీసుకుని అందులో రెండు టీస్పూన్ల శనగపిండి, రెండు టీస్పూన్ల బాదం పొడి, ఒక టీస్పూన్ తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. ఇలా చేయడం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.
 

56

నారింజ

నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. చర్మ సౌందర్యం, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే ఆరెంజ్ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగండి. అలాగే నారింజ తొక్కలో కూడా ఎన్నో గుణాలుంటాయి. నారింజ తొక్క మొటిమలను పోగొట్టడానికి, నల్లటి మచ్చలను తగ్గించడానికి, జిడ్డుగల చర్మాన్ని తొలగించడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం ఒక టీస్పూన్ నారింజ తొక్కల పొడిని తీసుకుని అందులో రెండు టీస్పూన్ల పెరుగు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. ఇది ముఖంపై ముడతలను తొలగించడానికి, నల్ల మచ్చలు, ముడతలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.
 

66
banana face pack

అరటిపండ్లు

అరటిపండ్లు ముఖంపై ముడతలను తగ్గించడానికి, మీ చర్మం మెరిసేలా చేయడానికి సహాయపడతాయి. ఇందుకోసం అర పండు గుజ్జును తీసుకుని అందులో ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ పాలను కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయండి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. 

click me!

Recommended Stories