bathukamma 2023: అలిగిన బతుకమ్మ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

First Published | Oct 19, 2023, 3:28 PM IST

bathukamma 2023: బతుకమ్మ పండుగ మొదలై ఇప్పటికే ఐదు రోజులు కంప్లీట్ అయ్యాయి. ఈ రోజు ఆరో రోజు. ఈ రోజును అలిగిన బతుకమ్మ అంటారు. అయితే ఈ రోజు అసలు బతుకమ్మనే చేయరు. ఈ అలిగిన బతుకమ్మ వెనుక ఎంత పెద్ద కథ ఉందో తెలుసా? 

Bathukamma 2023

బతుకమ్మ పండుగొచ్చిందంటే చాలు తెలంగాణలోని ప్రతి పళ్లె, పట్టణం తీరొక్క పూలతో అందంగా కనిపిస్తుంది.  ఏ ఇంట్లో చూసినా పూల గుభాలింపులే. ఇక ఈ పండుగ ఆడపడుచులకు తెచ్చే సంబురం అంతా ఇంతా కాదు. ప్రతి రోజూ రకరకాల పువ్వులతో అందంగా బతుకమ్మను ముస్తాబు చేసి మురిసిపోతారు. ఆడపిల్లలకు, బతుకమ్మకు విడదీయని సంబంధం ఉంటుందని ఇందుకే అంటారేమో. సాయంత్రమైతే చాలు ప్రతి వీధి, గల్లీ రంగురంగుల బతుకమ్మలతో కనువిందు చేస్తాయి. 
 

Bathukamma 2023

ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ఈ పండుగ ముగుస్తుంది. ఈ తొమ్మిది రోజుల పండుగను తొమ్మిది రకాల పేర్లతో పిలుస్తారు. ఇప్పిటికే మనం ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానెబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మలను ఎంతో ఘనంగా జరుపుకున్నాం. ఈ పూల పండుగలో ఇది ఆరో రోజు. ఈ రోజు అలిగిన బతుకమ్మను జరుపుకుంటున్నాం. అయితే అలిగిన బతుకమ్మ అని పేరు రావడానికి పెద్ద కథే ఉంది. ఈ రోజు అమ్మవారు అలకతో ఉంటారట. అందుకే ఈ  రోజుకు ఆ పేరు వచ్చిందని నమ్ముతారు. అంతేకాదు ఈ రోజు అసలు బతుకమ్మనే చేయరు. అయితే అలిగిన బతుకమ్మ వెనుక మరెన్నో కథలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
 


ఒక కథ ప్రకారం.. ఒకసారి బతుకమ్మను పేరుస్తుంటే.. బతుకమ్మకు అనుకోకుండా మాసం ముక్క తగులుతుందట. దీంతో అపచారమయ్యిందని బతుకమ్మ అలుగుతుందట. అందుకే ఈ ఆరో రోజును అలిగిన బతుకమ్మ అంటారు. అందుకే ఈ రోజు బతుకమ్మనే పేర్చరు. 
 

మరో కథ ప్రకారం.. దుర్గమాత మహా సరస్వతి, మహాకాళి రూపాల్లో రాక్షస సంహారం చేస్తుంది. దీంతో అమ్మవారు బాగా అలసటకు గురవుతుందట. దీంతో అమ్మవారు విశ్రాంతి తీసుకుంటారట. అందుకే ఈ రోజు బతుకమ్మను చేయరు. బతుకమ్మను ఆడరు. అయితే ఆరో రోజు బతుకమ్మను అలిగిన బతుకమ్మనే కాకుండా ఎన్నో రకాల పేర్లతో పిలుస్తుంటారు. ఇక ఏడో రోజు నుంచి యథావిధిగా బతుకమ్మను పేరుస్తారు. ఆడుతారు. 
 

Latest Videos

click me!