కళ్లు ఇలా మారాయా? జాగ్రత్త.. అవి కంటిచూపు దెబ్బతిన్నాయనడానికి సంకేతాలు కావొచ్చు..!

Published : May 22, 2022, 04:48 PM IST

మారుతున్న జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్లు వంటి వివిధ కారణాల వల్ల కంటిచూపు పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కంటిచూపు దెబ్బతిన్నప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

PREV
17
కళ్లు ఇలా మారాయా? జాగ్రత్త.. అవి కంటిచూపు దెబ్బతిన్నాయనడానికి సంకేతాలు కావొచ్చు..!

ఈ రోజుల్లో జబ్బులు లేని వ్యక్తులు లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పండు ముసలివాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. దీనికి తోడు మారుతున్న జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల కంటిచూపు పోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. నేడు చిన్న పిల్లలు సైతం కంటిచూపు సమస్యతో బాధపడుతున్నారు. 
 

27

సాధారణంగా కంటిచూపు మందగించడం, కంటి సమస్యలు 60 ఏండ్లు పైబడిన వారిలోనే కనిపించేవి. కానీ ఇప్పుడు చిన్న పిల్లను నుంచి యువత కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. దీనికి గల కారణాలేంటో తెలుసుకుందాం పదండి. 

37

కళ్లు ఎరుపెక్కడం.. ఇది చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. కళ్లు వివిధ కారణాల వల్ల ఎరుపెక్కుతాయి. నిద్రసరిగ్గా లేకపోయినా.. కంట్లో నలుసు పడ్డా కళ్లు ఎర్రబడతాయి. ఇలా ఎప్పుడో ఒకసారి మాత్రమే జరుగుతుంది. అయితే నిరంతరం మీ కళ్లు ఎర్రగానే ఉంటే మాత్రం మీ కళ్లు దెబ్బతిన్నాయని అర్థం చేసుకోవాలి. 

47

హాలో విజన్.. మీరు కంటిసమస్యలతో బాధపడుతున్నటైతే .. మీరు ఏదైనా లైటును లేదా సూర్యుడిని చూసినప్పుడు దాని చుట్టూరా చాలా బ్రైట్ గా కాంతి కనిపిస్తుంది. ఇలా  అనిపిస్తే మీరు కంటిసమస్యతో బాధపడుతున్నారని అర్థం చేసుకోవాలి. వెంటనే డాక్టర్ ను సంప్రదించడం ఉత్తమం. 

57

అస్పష్టంగా కనిపించడం.. దేనిని కూడా సరిగ్గా చూడలేకపోవడం.. సరిగ్గా కనిపించకపోవడం వంటివి..మీ కంటిచూపు దెబ్బతిన్నది అనడానికి సంకేతాలు. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మర్చిపోకూడదు. 

67

జీర్ణసమస్యలు.. కంటికి జీర్ణ సమస్యలకు కారణం ఏంటన్న సందేహం కలగొచ్చు. జీర్ణవ్యవస్థ అసౌకర్యంగా ఉండటానికి గ్లకోమానే అసలు కారణం. దీనివల్ల కడుపు అసౌకర్యంగా అనిపించడం, వికారం వంటివి కంటి సమస్యలకు లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

77

ఎప్పుడూ తలనొప్పిగా అనిపించడం.. ఎప్పుడూ తలనొప్పిగా అనిపించినా అనుమానించాల్సిందే. ఎందుకంటే ఇది కంటికి సంబంధించిన సమస్య కాబట్టి.  కండ్ల చుట్టూ నొప్పిగా అనిపిస్తే మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించండి. 

Read more Photos on
click me!

Recommended Stories