స్టైలీష్ గా కనిపించడానికి జీన్స్ ను ఎలా వేసుకోవాలి?

First Published | Dec 5, 2023, 11:37 AM IST

అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా జీన్స్ లను ఎక్కువగా వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. క్యాజువల్ గానే కాకుండా కొన్ని పార్టీలకు కూడా జీన్స్ లను వేసుకుంటారు. కానీ వీటిలో స్టైలిష్ గా కనిపించాలంటే వీటిని ఎలా వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

అబ్బాయిల నుంచి అమ్మాయిల వరకు వార్డ్ రోబ్ లలో రెండు మూడు జతల జీన్స్ లు పక్కాగా ఉంటాయి. ఎందుకంటే ఇవి చాలా కంఫర్ట్ గా ఉంటాయి. అలాగే ఇవి ఎక్కడైనా, ఎప్పుడైనా తీసుకెళ్లగలిగే దుస్తులు కూడా. క్యాజువల్ విహారయాత్రల నుంచి పార్టీల వరకు.. జనాల మొదటి ఎంపిక జీన్స్. ఎందుకంటే దీనికి పెద్దగా స్టైలింగ్ అవసరం లేదు. కానీ వీటిని సెలక్ట్ చేసుకునే ముందు కొన్ని చిట్కాలను తప్పకుండా పాటించాలి. జీన్స్ లో స్టైలీష్ గా కనిపించడానికి ఏం చేయాలో చాలా మందికి తెలియదు. మనం తరచుగా చేసే కొన్ని సాధారణ పొరపాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

లైట్ వాష్ లేదా డార్క్ వాష్ జీన్స్

జీన్స్ లో మీరు అందంగా, స్టైలీష్ గా కనిపించడానికి మీరు ముందుగా చేయాల్సిన పని.. డార్క్ వాష్ జీన్స్ ను ఎప్పుడూ కూడా సాయంత్రం పూట ధరించాలి. పగటిపూట లైట్ వాష్ జీన్స్ ను వేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

Latest Videos


స్లిమ్ ఫిట్ లేదా సన్నగా కనిపించడానికి

స్లిమ్ ఫిట్ జీన్స్ అంటే స్లిమ్ షేప్ ఉన్న జీన్స్, స్కిన్ జీన్స్ ఫిట్టింగ్ సరిగ్గా గ్లౌజుల మాదిరిగానే ఉంటుంది. కాబట్టి మీ తొడలు మందంగా ఉంటే మీరు స్లిమ్ ఫిట్ జీన్స్ ధరించడం మానుకోవాలి.
 

క్రాస్డ్ర జీన్స్

మీరు క్రాప్డ్ జీన్స్ ప్రయత్నించాలనుకుంటే.. క్రాప్డ్ జీన్స్ పొడవు చీలమండ పైన లేదా క్రింద ఎక్కువగా ఉండకుండా చూసుకోండి. ఇది ఎప్పుడూ కూడా చీలమండ పైభాగంలోనే ఉండాలి. 
 

jeans

కాళ్ల దగ్గర 

మీ జీన్స్ పొడవుగా ఉంటే వాటిని వేసుకున్నప్పుడు అది మీ పాదరక్షల దగ్గర కుప్పలా కనిపిస్తుంది. దీంతో మీరు అస్సలు అందంగా కనిపించరు. అందుకే మరీ పొడవుగా ఉండే జీన్స్ లను వేసుకోకండి.
 

బెల్ట్ 

జీన్స్ తో బెల్టును పెట్టుకుంటే కూడా బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ జీన్స్ పైకి బెల్టు అస్సలు సెట్ కాదు. అవసరమైనప్పుడు మాత్రమే బెల్ట్ పెట్టుకోండి. లేకపోతే బెల్ట్ లేకుండా కూడా జీన్స్ ను ధరించండి.  అనవసరంగా బెల్టును పెట్టుకుంటే అస్సలు మంచిగ అనిపించదు. 

click me!