Dates Quality Check Tips : మీరు కొనే ఖర్జూరం అసలుదా, నకిలీదా? ఈ సింపుల్ టిప్స్‌తో కనిపెట్టండి

Published : Aug 07, 2026, 01:48 PM IST

ఖర్జూరాలు కొనేటప్పుడు ఏవి మంచివో, ఏవి నాసిరకమో ఎలా తెలుసుకోవాలి? రంగు, మెరుపు, రుచి, మెత్తదనం, ప్యాకింగ్, గడువు తేదీ వంటి 7 ముఖ్యమైన విషయాల ద్వారా వాటి నాణ్యతను గుర్తించడం ఎలాగో తెలుసుకొండి.

PREV
17
డేట్స్ క్వాలిటీని చెక్ చేసే టిప్స్..
పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్‌లో ఖర్జూరం ఒకటి. దీన్ని నేరుగా స్నాక్‌గా లేదా పాలు, స్మూతీలలో కలిపి తీసుకుంటారు. కానీ మార్కెట్లో దొరికే అన్ని ఖర్జూరాలు ఒకే నాణ్యతతో ఉండవు. కొన్నింటికి కృత్రిమ రంగులు, చక్కెర పూత లేదా నాసిరకం పండ్లు ఉండే అవకాశం ఉంది. అందుకే ఖర్జూరాలు కొనేటప్పుడు పైకి చూసి కాకుండా, కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించాలి.
27
రంగును బట్టి డేట్స్ క్వాలిటీ తెలుసుకొండి
మంచి నాణ్యమైన ఖర్జూరాలు సహజంగా లేత గోధుమ రంగు నుంచి ముదురు గోధుమ రంగు వరకు ఉంటాయి. పండు రకాన్ని, ప్రాసెసింగ్ పద్ధతిని బట్టి రంగు, రూపంలో తేడా ఉంటుంది. అందుకే అన్నీ ఒకేలా, అసహజమైన రంగులో కనిపిస్తే కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా, పండుపై రంగు పూసినట్లు అనిపిస్తే వాటిని కొనకపోవడమే మంచిది.
37
ఖర్జూరం మెరుపును బట్టి నాణ్యత తెలుసుకొండి
ఖర్జూరాలు సహజంగానే కొద్దిగా మెరుస్తూ ఉంటాయి. కానీ మరీ ఎక్కువగా నూనె పూసినట్లు లేదా కృత్రిమంగా పాలిష్ చేసినట్లు కనిపిస్తే, వాటి నాణ్యతపై అనుమానించాల్సిందే. పండు ఉపరితలంపై అసహజంగా జిగురుగా లేదా నునుపుగా ఉంటే, దాని లేబుల్, తయారీ వివరాలను ఒకసారి చెక్ చేయడం మంచిది.
47
రుచిని బట్టి ఖర్జూరం నాణ్యత తెలుసుకొండి
అసలైన, మంచి నాణ్యమైన ఖర్జూరంలో సహజమైన తీపి ఉంటుంది. పండు రకాన్ని బట్టి తీపి మోతాదు మారుతుంది. కానీ తినేటప్పుడు కృత్రిమ తీపి, వింత వాసన లేదా రసాయనం లాంటి రుచి వస్తే, వాటిని తినకపోవడమే మంచిది.
57
ఖర్జూరం ఆకారాన్ని బట్టి క్వాలిటీ తెలుసుకొండి

ఖర్జూరం రకాన్ని బట్టి దాని ఆకృతి (texture) మారుతుంది. కొన్ని రకాలు మెత్తగా, మరికొన్ని కొంచెం పొడిగా ఉంటాయి. కానీ పండు మరీ గట్టిగా, సహజత్వాన్ని కోల్పోయి, తినడానికి ఇబ్బందిగా ఉంటే, అది చాలా కాలం నిల్వ ఉంచినదేమో చూడాలి. అలాగే ఎక్కువగా అంటుకుంటున్నా కూడా గమనించాల్సిన విషయమే.

67
ఖర్జూరం ఇలా చెక్ చేయండి.

ఖర్జూరంలో కృత్రిమ రంగు కలిపారో లేదో తెలుసుకోవడానికి నీటిలో వేసి చూడాలనే ప్రచారం ఉంది. నీటిలో రంగు ఎక్కువగా వస్తే అనుమానించవచ్చు. కానీ దీన్ని బట్టి మాత్రమే ఖర్జూరం 'నకిలీ' అని కచ్చితంగా నిర్ధారించలేం. 

ఇంట్లోనే ఆహార కల్తీని గుర్తించడానికి FSSAI కొన్ని పరీక్షలను సూచించినప్పటికీ, అన్ని ఆహార పదార్థాలకు ఒకే పరీక్ష సరిపోదు. అనుమానం ఉంటే ఆహార భద్రతా అధికారుల పరీక్ష లేదా నమ్మకమైన ల్యాబ్ పరీక్షే కచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది.

77
ప్యాకెజ్డ్ డేట్స్ ను ఇలా చెక్ చేయండి.

ప్యాక్ చేసిన ఖర్జూరాలను కొనేటప్పుడు దాని లేబుల్‌ను తప్పనిసరిగా చదవాలి. తయారీ తేదీ, Best Before లేదా Use By తేదీ, వాడిన పదార్థాల జాబితా, తయారీదారు వివరాలు, FSSAI లైసెన్స్ వివరాలు వంటివి గమనించాలి.

FSSAI ప్రకారం “Use By/Expiry” అంటే ఆ తేదీ తర్వాత ఆహారం భద్రత, నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని అర్థం. “Best Before” అంటే ఆ గడువులోపు ఆహార నాణ్యత ఉత్తమంగా ఉంటుందని సూచిస్తుంది.

ప్యాకింగ్, నిల్వ విధానాన్ని కూడా గమనించండి

బయట దుమ్ము, ఈగలు, తేమకు గురయ్యేలా ఉంచిన ఖర్జూరాలను కొనకపోవడం మంచిది. ప్యాకేజింగ్ దెబ్బతిన్నా, లోపల బూజు పట్టినట్లు కనిపించినా కొనవద్దు. భారత ఆహార భద్రతా నిబంధనల ప్రకారం ఖర్జూరాలను శుభ్రమైన, సరిగ్గా పండిన పండ్లను ఎండబెట్టి తయారు చేయాలి. వాటిపై కీటకాలు, బూజు, ఇతర మురికి ఉండకూడదు.

ఆరోగ్యకరమైన ఖర్జూరం కొనాలంటే ఏం చేయాలి?

కొనేటప్పుడు కేవలం తక్కువ ధరను చూసి నిర్ణయం తీసుకోవద్దు. నమ్మకమైన దుకాణం లేదా బ్రాండ్ నుంచి కొనడం, ప్యాకింగ్, లేబుల్ తనిఖీ చేయడం, పండు రూపు, వాసన గమనించడం ముఖ్యం. మరీ మెరుస్తున్నంత మాత్రాన అది 'నకిలీ' అని కాదు. అలాగే రంగు కొద్దిగా మారినంత మాత్రాన నాణ్యత లేదని కాదు. ఖర్జూరం రకాన్ని బట్టి సహజమైన రంగు, మెత్తదనం, రూపం మారవచ్చు.

కాబట్టి రూపం + వాసన + ఆకృతి + లేబుల్ + ప్యాకింగ్ అన్నీ కలిపి చూసి కొనడమే ఉత్తమ మార్గం. అనుమానాస్పదంగా ఉన్న ఆహార పదార్థాన్ని తినకుండా ఉండటం, అవసరమైతే ఆహార భద్రతా అధికారులకు ఫిర్యాదు చేయడం సురక్షితమైన పద్ధతి.

Read more Photos on
click me!

Recommended Stories