Mango Fruits : కెమికల్స్ తో పండిన మామిడి పండ్లు ఇలా ఉంటాయి.. జాగ్రత్త చూసి కొనండి..

Published : May 19, 2022, 02:07 PM ISTUpdated : May 19, 2022, 02:08 PM IST

Mango Fruits : ఒక వేసవిలోనే లభించే మామిడి పండ్లంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరేమో. అయితే చాలా మంది మామిడి పండ్లు పక్వానికి రాకముందే కార్బైడ్ అనే కెమికల్ ను వేసి పండిస్తున్నారు. ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరం. మరి వీటిని ఎలా గుర్తించాలంటే..   

PREV
18
Mango Fruits : కెమికల్స్ తో పండిన మామిడి పండ్లు ఇలా ఉంటాయి.. జాగ్రత్త చూసి కొనండి..

పండ్లలో రారాజైన మామిడి పండ్లలకు వేసవిలో కొదవే ఉండదు. కమ్మనైన వాసనతో.. తియ్యని రుచితో నోరూరిస్తుంటాయి. ఇంకేముంది ఈ సీజన్ ప్రారంభం నుంచి ముగిసే వరకు మామిడి పండ్లను తింటుంటారు. అందులోనూ ఇప్పుడు ఎక్కడ చూసినా మామిడి పండ్లే దర్శనమిస్తుంటాయి. 
 

28

పసుపు పచ్చగా.. చూడగానే తినాలనిపించే రంగులో ఆకర్షిస్తుంటాయి. అయితే మార్కెట్ లో లభించే అన్ని పండ్లు మన ఆరోగ్యానికి మేలు చేసేవి కాకపోవచ్చు. అంటే కొంతమంది మామిడి పండ్లు మగ్గకముందే కార్భైట్ అనే కెమికల్ వేసి తొందరగా పండిస్తున్నారు. ఇది ప్రమాదకరమైన క్యాన్సర్ కు దారితీస్తుంది. 
 

38

అందుకే మామిడి పండ్లను కొనే వారు చాలా జాగ్రత్తగా ఉంటాలి. మీరు కొనే పండ్లు సహజంగా పండినవా? లేకపోతే కార్బైట్ వేసి పండించినవో తెలుసుకోవాలి. అదెలాగో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి. 
 

48

కెమికల్ తో పండించిన పండ్లను గుర్తించడం చాలా సులువు. సహజంగా పండిన మామిడి పండ్లు ఎలాంటి మచ్చలు లేకుండా పండంతా ఒకే రంగులో ఉంటుంది. అదే కెమికల్ తో పండిన కాయ అయితే అక్కడక్కడ ఆకుపచ్చమచ్చలు ఉంటాయి. 
 

58

వాసనను బట్టి కూడా కెమికల్ తో పండినదా? సహజంగా పండిందో ఇట్టే తెలుసుకోవచ్చు. మీరు కొన్ని మామిడి పండు తొడిమ దగ్గర వాసన చూడండి. అక్కడి నుంచి కమ్మని వాసన వస్తే అది సహజంగా పండిందని అర్థం చేసుకోండి. అలాగే మామిడి పండును చిన్నగా నొక్కితే మెత్తగా అనిపిస్తే కూడా అది సహజంగా పండినదే. 

68
mango

కెమికల్ తో మగ్గించిన పండ్లల లోపల అక్కడక్కడ మగ్గదు. అంటే కొన్ని ప్లేసెస్ లో కచ్చిగానే ఉంటుంది. అంతేకాదు కాస్త పుల్లగా కూడా ఉంటుంది. 

78

ఇక సహజంగా పండిన పండ్లైతే బయటగానీ లోపల గానీ .. రంగంతా ఒకే తీరుగా ఉంటుంది. అలాగే మెత్తగా కూడా ఉంటుంది. రసం ఎక్కువగా ఉంటుంది. అలాగే తియ్యగా కూడా ఉంటుంది. 

88
mango

చివరగా నేచులర్ గా పండిన పండ్లు వాటర్ లో వేస్తే కిందికి వెళతాయి. అవే కెమికల్ వేసిన పండ్లైతే నీళ్లలో పైకి తేలియాడుతూ ఉంటాయి. 

click me!

Recommended Stories