Valentines day 2022: మొదటి సారి వాలెంటైన్స్ డే జరుపుకునే వారికోసం అద్బుతమైన టిప్స్..

First Published | Feb 6, 2022, 4:27 PM IST


Valentines day 2022: ఫస్ట్ టైం ప్రేమికుల రోజును జరుపుకునే వారు ఆ రోజు ఎంతో అందంగా, అద్బుతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఆ డే ను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో మాత్రం తెలియదు. అలాంటి వారికోసమే ఈ ఆర్టికల్..
 


How to Celebrate First Valentines Day: ప్రేమికులకు ఎంతో ఇష్టమైన రోజు మరికొన్ని రోజుల్లో రానుంది. ఈ ఫిబ్రవరి 14 కోసం ఎంతో మంది ప్రేమికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ అందమైన క్షణాల కోసం ఎన్నో ఎన్నో ప్లాన్స్ వేసుకునే వారు చాలా మందే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఫిబ్రవరి అంతా ప్రేమికుల రోజులే. ఇదో రొమాంటిక్ నెలగా చెప్పుకోవచ్చు.  ప్రపోజ్ డే నుంచి మొదలు పెడితే.. బ్రేకప్ వరకు ఈ ఫిబ్రవరి నెలలో ప్రతి రోజుకో ప్రత్యేకత ఉంటుంది. అందుకోసమే ప్రేమికులతో పాటుగా పెళ్లైన జంటలు సైతం వాలెంటైన్స్ డేను గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు.
 

వాలెంటైన్స్ డే దగ్గరపడుతున్న కొద్దీ ప్రేమికుల్లో ఆందోళన పెరిగిపోతూ ఉంటుంది. మఖ్యంగా ఫస్ట్ టైం వాలెంటైన్స్ డే ను జరుపుకునే వారికి ఈ ఆందోళన మరింతగా ఉంటుంది. ఎందుకంటే వారి మొదటి సెలబ్రేషన్ గొప్పగా ఉండాలని ఆశపడుతుంటారు. అందులోనూ గర్ల్ ఫ్రెండ్ లేదా.. బాయ్ ఫ్రెండ్ తో గడిపే క్షణాలు మధురమైనవిగా, ప్రత్యేకమైనవిగా ఉండాలని కోరుకుంటారు. అందుకే ఆ డేను స్పెషల్ గా ఉండాలని ఆశపడుతుంటారు. అయితే మొదటిసారి ఈ సెలబ్రేషన్స్ చేసుకునే వారికి ప్రేమికుల రోజును ఎలా జరుపుకోవాలో అంతగా తెలియదు. మీకు కూడా మొదటిసారి ఈ డేను సెలబ్రేట్ చేసుకునే వారైతే.. ఈ సింపుల్ అండ్ సూపర్ చిట్కాలు మీకోసమే.. 

Latest Videos



ప్రేమికుల రోజు ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మాత్రం .. మీ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్  మనసుకు నచ్చే  బహుమతిని ఇవ్వండి. వారి మనసును ఆకర్షించే గిఫ్టును ఇవ్వడం వల్ల వారు ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేరు. అంతేకాదు వారికి మీరు స్పెషల్ వ్యక్తులుగా కనిపిస్తారు. అంతేకాదు అది భావోద్వేగంగా, ఎన్నిటికీ గుర్తుండిపోయేదిలా ఉంటుంది. అందుకే వాలెంటైన్స్ డేకు  వాలెంటైన్స్ డేకు వేర్వేరుగా బహుమతులను ప్రెజెంట్ చెయ్యాలి. దీని వల్ల వారికి మీరు ఎంత విలువ ఇస్తున్నారో తెలుసుకుంటారు. 
 

ప్రేమకు గుర్తు, ప్రేమికులు అమితంగా ఇష్టపడేవి ఏమైనా ఉన్నాయా అంటే అందులో ముందు స్థానంలో ఉంటాయి రెడ్ రోజెస్. అందులోనూ గులాబి పువ్వుతో ప్రపోజ్ చేయడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తున్న సంగతి మనకు తెలిసిందు. వాలెంటైన్ డే రోజును మీ ప్రియమైన వారికి ఒక రోజు పువ్వు  ఇవ్వడం వల్ల వారెంతో ఆనందిస్తారు. అందుకే ప్రేమికుల రోజున మీ లవర్ కు రోజా పువ్వును లేదా రెడ్ రోజెస్ బొకేను అందించండి. 

వాలెంటైన్స్ డే అంటే కలిసి సెలబ్రేట్ చేసుకోవడం, బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడమే కాదు.. మీరు వారిని ఎంత ఇష్టపడుతున్నారో మాటల్లో చెప్పండి. ఎవ్వరికైనా ఉంటుంది.. తమను ఎంతలా లవ్ చేస్తున్నారో తెలుసుకోవాలని. మీ నోటి ద్వారా ఆ విషయం చెప్తే వారెంతో సంతోషిస్తారు. అంతేకాదు వారికి మీపై ప్రేమ మరింత పెరిగే అవకాశముంది. ఇది మరపురాని క్షణంగా గుర్తుండి పోతుంది. 

మీరు అమితంగా ఇష్టపడే వ్యక్తితో సాయంత్రం వేల గడిపితే అదో గొప్ప అనుభూతినిస్తుంది. ప్రేమికుల రోజు మరింత ఆహ్లాదకరంగా ఉండాలంటే మాత్రం మీకోసం రెస్టారెంట్ డిన్నర్ ను ప్లాన్ చేసుకోండి. ప్రియుడు లేదా ప్రియురాలికి ఏది ఇష్టమో దాన్ని వారికి ఇవ్వండి. కాగా క్యాండిల్ లైట్ డిన్నర్ మీకు మంచి అనుభూతినిస్తుంది.  

click me!