సంసార జీవితం సాఫీగా సాగాలంటే భార్యా భర్తల మధ్యన ఎనలేని ప్రేముండాలి. అంతేకాదు వారిద్దరి మధ్య సెక్స్ లైఫ్ కూడా బాగుండాలి. వీరిరువురిలో ఏ ఒక్కరికీ ఇది ఇంట్రెస్ట్ లేకపోయినా.. వారి మధ్యన మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. లైఫ్ అంటే పడక సుఖమొక్కటి ఉంటే చాలదు కదా అనే వారు చాలా మందే ఉన్నారు. కానీ ఆలుమగల మధ్యన ఆ సుఖం లేకపోతే వారిమధ్యన దూరం పెరిగి మనస్పర్థలు వచ్చే ప్రమాదముంది. అందులోనూ వారిరువురిలో ఎవరికో ఒకరికి అది కావాలనిపిస్తుంది. అటువంటప్పుడు ఇరువురు సహకరించుకుంటే ఎటువంటి సమస్యా ఉండదు. అంతేకాదు భార్యా భర్తల మధ్యన ప్రేమ కూడా పెరుగుతుంది. అంతేకాదు వారి సంసార జీవితం కూడా సాఫీగా సాగుతుంది.
అయితే మగవారితో పోల్చితే ఆడవారే ఆ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారని పలు అధ్యయనాలు చెబుతున్నారు. కొంతమంది ఆడవారు తమ భాగస్వామి ఈగోను Satisfaction చేసేందుకే భావప్రాప్తి (Orgasm)పొందినట్లుగా నటిస్తున్నారని సర్వేలు పేర్కొంటున్నాయి. ఇలా చెప్పడం వల్ల వారి భాగస్వాములు సంతోషించడమే కాదు.. వారి భార్యలను ప్రేమగా చూసుకుంటున్నారట. అలా నటించకపోతే మగవారు తమలో ఆ సామర్థ్యం తగ్గిపోయిందని క్రుంగిపోతున్నారట. ఈ విషయంపై చాలా రోజుల నుంచి ఎన్నో చర్చులు జరుగుతున్నాయి. దీనిపై అమెరికాకు చెందిన ఓ సంస్థ తాజాగా ఓ సర్వే నిర్వహించి ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించింది. సెక్స్ చేసే టైం లో ఆడవారి అరుపులు కేవలం వారి భాగస్వామిని సంతృప్తి పరిచేందుకు అలా నటిస్తున్నారని తేలింది.
చాలా మంది మగవారికి వారి సామర్థ్యం ఎంతుందో తెలుసుకోవాలనే అత్యుత్సాహం ఉంటుందట. అందుకే కేవలం వారిని సంతోషపెట్టేందుకు ఆడవారు వారు తమ సంతోషాన్ని త్యాగం చేసి.. సంతృప్తి చెందినట్టుగా నటిస్తారట. దీంతో మగవారు వారు మగతనం విషయంలో సంపూర్ణంగా ఫీలవుతారట.
కేవలం కొంతమంది ఆడవారు తమ భాగస్వాములు ఆ విషయంలో నమ్మకం కలిగించేందుకే అలా నటిస్తారని.. తాజా పరిశోధన Social Psychological and Personality Science లో ప్రచురితమైంది. కాగా చాలా మంది మగవారిలో మగతనం విషయంలో చిన్నపాటి డౌట్ ఉంటుందట. దీని కారణంగా వారు మానసికంగా క్రుంగుబాటుకు గురవుతుంటారట. అందుకే వారిని నిరుత్సాహపరచకుండా ఆడవారు భావప్రాప్తి పొందినట్టుగా నటిస్తారట. ఇలా చేయడం వల్ల మగవారు సంతోషంగా ఫీలవ్వడమే కాదు.. వారి భార్యలను ప్రేమగా చూసుకుంటారని సర్వే తేల్చి చెబుతోంది.
283 మంది ఆడవారిని ఈ పరిశోధనకు సెలక్ట్ చేసుకున్నారు. ఇందులో తేలిందేమంటే.. వారి ఆ విషయంలో భాగస్వామి తమ సామర్థ్యం తగ్గిపోతుందని బాధపడుతున్న సమయంలోనే వారు అలా నటిస్తున్నారట. అంతేకాదు తమకంటే వారి భార్యలు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారో వారు తమను ఎక్కడ తక్కువ చూస్తారేమోనన్నఆలోచనలో ఉంటున్నారట. ముఖ్యంగా భర్తకంటే ఎక్కువ డబ్బులు సంపాదించే భార్యలు ఆ విషయంలో ఇతర మహిళల కంటే Double fake orgasm కు గురవుతున్నారని అధ్యయనం చెబుతోంది. కాగా ఇటువంటి వారు ఎక్కడ తమ భర్త ఫీలవుతాడోనని ఆ విషయంలో ఎక్కువగా నటిస్తున్నారట.
University of South Florida కు చెందిన జెస్సికా జోర్డాన్ అనే రచయిత్రి ఇలా మాట్లాడింది.. ‘ఆడవారు తమ భర్తల గురించే ఆలోచిస్తారు. ముఖ్యంగా వారి లైంఘిక అవసరాలు, సంతృప్తి లను పక్కన పెట్టేసి.. ఎంతవరు వారి భాగస్వామి సంతోషం గురించే ఆలోచిస్తారు. కానీ మగవారు మాత్రం అలా కాదు. వారి భార్యలను అర్థం చేసుకోరు. మగతనం ఉందనే కారణంతో ఆడవారిని చిన్నచూపు చూస్తారు’అని అన్నారు.