ప్రపంచ సుందరి మీరు కూడా కావొచ్చు తెలుసా? మిస్ వరల్డ్ కున్న అర్హతలు ఇవే..!

First Published Feb 10, 2024, 1:06 PM IST

మిస్ వరల్డ్ అందాల పోటీల గురించి తెలియని వారుండరు. ఈ పోటీల్లో ఎంతో మంది అందగత్తెలు పాల్గొంటారు. కానీ వారిలో ఒక్కరు మాత్రమే ప్రపంచ సుందరిగా నిలబడతారు. ఇది అందరికీ తెలిసిందే. కానీ అసలు ఈ పోటీల్లో ఎలా పాల్గొంటారు? దీనిలో పాల్గొనాలంటే ఏ అర్హతలు ఉండాలి? ఎలా పార్టిసిపేట్ చేయాలి? అన్న విషయాలు చాలా మందికి తెలియదు. ఈ నెలలోనే మన దేశంలో మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్న సందర్భంగా ఈ విషయాలన్నింటినీ తెలుసుకుందాం పదండి. 
 

చాలా కాలం తర్వాత భారత్ తో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. దాదాపుగా 30 ఏండ్ల తర్వాత ఇండియా మిస్ వరల్డ్ పోటీలకు వేదికైంది. ఈ పోటీల్లో ప్రపంచంలోని ఎంతో మంది అమ్మాయిలు పాల్గొంటారు. ఇది అందరికీ తెలిసిన ముచ్చటే. కానీ దీనిలో ఎవరెవరు పాల్గొంటారు? దీనిలో పాల్గొనాలంటే ఏం క్వాలిటీస్ ఉండాలి? దీనిలో పాల్గొనాలంటే ఏం చేయాలి అన్న సంగతి చాలా మందికి తెలియదు. మీకు తెలుసా? మీరు కూడా ఈ మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనొచ్చు. కానీ కొన్ని అర్హతలు మాత్రం ఉండాలి. మన దేశంలో ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి. కాబట్టి.. ఈ పోటీల్లో పాల్గొనేవారికి ఎలాంటి అర్హతలు ఉండాలి? దీనిలో పాల్గొనేవారు ఎలా ఉండాలో తెలుసుకుందాం పదండి. 
 

మిస్ వరల్డ్ గురించి..

మిస్ వరల్డ్ అనేది యునైటెడ్ కింగ్ డమ్ లోని లండన్ లో.. జూలై 1951 లో ఎరిక్ మోర్లే సృష్టించిన అతిపురాతన అంతర్జాతీయ అందాల పోటీ. 1951లో స్వీడన్ కు చెందిన కికి హాకాన్సన్ తొలి మిస్ వరల్డ్ విజేతగా నిలిచారు. ఇకపోతే 1966లో ప్రతిష్టాత్మక టైటిల్ నెగ్గిన తొలి భారతీయురాలు రీటా ఫరియా. 1994లో ఐశ్వర్యరాయ్, 1997లో డయానా హేడెన్, 1999లో యుక్తా ముఖే, 2000లో ప్రియాంక చోప్రా జోనస్, 2017లో మానుషి చిల్లార్ ఈ టైటిల్ ను గెలుచుకున్నారు.

Latest Videos


sini shetty miss world 2023

మిస్ వరల్డ్ అర్హతలేంటి? 

1. మిస్ వరల్డ్ లో పాల్గొనాలనుకునే వారి వయసు 17-27 ఏళ్ల మధ్య ఉండాలి.

2. అయితే ఈ కంటెస్టెంట్లు పెళ్లి చేసుకుని, ప్రెగ్నెంట్, పిల్లల్ని కని ఉండకూడదు.

3. ఫైనల్ కు ముందు టాలెంట్ రౌండ్, బ్యూటీ విత్ ఎ పర్పస్ రౌండ్, హెడ్-టూ-హెడ్ ఛాలెంజ్ తో పాలుగా ఎన్నో ప్రిలిమినరీ పోటీల ఆధారంగా అభ్యర్థులను నిర్ణయిస్తారు.

4. విదేశాలకు వెళ్లాలంటే అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే పాస్పోర్టు కలిగి ఉండాలి.

5. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనాలనుకునే వారికి ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. అలాగే న్యాయపరమైన సమస్యలు కూడా ఉండకూడదు.
 

మిస్ వరల్డ్ పోటీలకు మిమ్మల్ని మీరు ఎలా సిద్ధం చేసుకోవాలంటే?

1. స్థానిక, జాతీయ అందాల పోటీల్లో పాల్గొనండి. 

2. అందాల పోటీలకు సిద్ధం కావడానికి ఒక కోచ్ ను ఎంచుకోండి.

3. మిస్ వరల్డ్ లో మీ దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి దరఖాస్తు చేసుకోండి.

4. ప్రిలిమినరీ ఇంటర్వ్యూలో క్వాలిఫై అవ్వడానికి మానవతా అంశాలు అవసరం. అందుకే క్రియాశీలత, ప్రాపంచికతలో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకోండి.

5. మీరు స్థానిక, అంతర్జాతీయ స్థాయిలో ఎలా? ఏం చేశారో వివరించండి.

6. మీరు పోటీకి అర్హత సాధిస్తే.. ఒక యాక్టివిజం ప్రాజెక్టును సమర్పించాల్సి ఉంటుంది.

7. మిస్ వరల్డ్ పోటీల్లో ప్రతిభ, ఫిట్నెస్, ప్రాపంచికత ఆధారంగా మిమ్మల్ని జడ్జ్ చేస్తారు.
 

మిస్ వరల్డ్ అందాల పోటీల్లో..

1. మీ చర్మం, శరీరంపై నమ్మకంగా ఉండండి.

2. ఆత్మవిశ్వాసంతో ఉండండి. 

3. ఈ పోటీల్లో మీ ముఖంపై చిరునవ్వు చెదరకుండా చూసుకోండి.  

4. మాదకద్రవ్యాలు లేదా ధూమపానం మానుకోండి.

5. ప్రశాంతంగా ఉండండి.

miss world

అందాల పోటీల్లో గెలవడం ఎలా?

1. మిస్ వరల్డ్ ఆలోచన అందం విత్ ఎ పర్పస్. అంటే మిస్ వరల్డ్ సంస్థ అందమైన ముఖం కోసం మాత్రమే కాకుండా.. మానవతా దృక్పథాన్ని కూడా సమర్థించగల వ్యక్తిని వెతుకుతుంది. అందుకే ప్రాపంచికత, క్రియాశీలత మిస్ వరల్డ్ కు ప్రధాన అవసరాలు.

2. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మీ చుట్టూ ఉన్న డిజిటల్ ప్రపంచంతో మమేకం అవ్వండి. ప్రపంచంలో సానుకూల మార్పును తీసుకురాగల కంటెంట్ ను మీ సోషల్ హ్యాండిల్స్ ద్వారా డెలివరీ చేయండి.

3. న్యాయనిర్ణేతలను ఆకట్టుకోవడానికి మీ ప్రత్యేకమైన ప్రతిభను, అభిరుచిని ప్రదర్శించండి. 

4. మోడలింగ్ పోటీలో మీకు నిజంగా ప్రాతినిధ్యం వహించే ఏదైనా ధరించండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. బాల్ గౌన్ ధరించినప్పుడు చిరునవ్వుతో మిమ్మల్ని మీరు అందంగా ప్రదర్శించండి.

5. కంటెస్టెంట్స్ ఫిజికల్ ఫిట్నెస్ స్థాయిని బట్టి.. ఫిజికల్ ఫిట్ గా ఉండాలి. ఫినాలేలో స్థానం సంపాదించడానికి పోటీలో గెలవడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి.

6. మీ మాతృభూమి కోసం మీరు ఏం చేశారు? అలాగే దానిని ప్రపంచ స్థాయికి ఎలా ముందుకు తీసుకెళ్తారు? అనే వాటి గురించి మాట్లాండి. 

7. ఫినాలే సమయంలో మిస్ వరల్డ్ అందాల పోటీల్లో మీ మొత్తం ప్రదర్శనను బట్టి జడ్జ్ చేస్తారు.
 

MISS WORLD

మిస్ వరల్డ్: ఎంపిక ప్రమాణాలు ఏమిటి?

1. మిస్ వరల్డ్ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు అర్హత సాధించాలి.

2. టాలెంట్ రౌండ్, బ్యూటీ విత్ ఎ పర్పస్ రౌండ్, హెడ్-టూ-హెడ్ ఛాలెంజ్ వంటి వివిధ ఫాస్ట్ ట్రాక్ ఈవెంట్ల ద్వారా ఫైనల్స్ కు చేరుకుంటారు.

3. కంటెస్టెంట్లు ఇప్పటి వరకు ప్రతిభ నుంచి ఫిట్నెస్ వరకు ప్రదర్శించిన అంశాల ఆధారంగా విజేతను న్యాయనిర్ణేతలు ప్రకటిస్తారు.

click me!