Love: మీ లవర్ మిమ్మల్ని దూరం పెట్టినట్టు అనిపిస్తోందా? ఈ కారణాలే కావొచ్చు..

First Published | Feb 3, 2022, 2:43 PM IST


Love: ప్రేమలో ఉన్నవారికి తమ చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధమే లేకుండా బతికేస్తుంటారు. ఎంతైనా అదో వింతైన ప్రపంచమే. అయితే కొందరి ప్రేమ.. వివాహం వరకు ప్రయాణిస్తే.. మరికొందరి లవ్ మధ్యలోనే బ్రేకప్ అవుతుంది. ఉన్నట్టుండి సడెన్ గా వాళ్ల లవర్లను దూరం పెడుతుంటారు. కారణాలేంటో తెలుసా..


Love:నిన్న మొన్నటి దాకా బాగానే మాట్లాడేది.. ఇప్పుడేమైందని ఇలా సడెన్ గా మాట్లాడటం మానేసింది. నేనేమైనా తప్పు చేస్తే చెప్పాలి కదా అని అబ్బాయిలు బాధపడితే.. రోజుకు ఎన్ని గంటలు మాట్లాడేవాడు.. నేనంటే అప్పుడే విసుగుపుట్టుకొచ్చిందా. ఏ కారణం చేత నన్ను దూరం పెట్టాడు. ఫోన్ చేసినా ఎందుకు ఎత్తడం లేదని తెగ బాధపడిపోతుంటారు అమ్మాయిలు.  ఇలాంటి ఘటనలు మనచుట్టూనే జరుగుతుంటాయి. మరికొందరికి ఇలాంటి విషయాల్లో అనుభవం కూడా ఉంటుంది. అయితే ఇలా సడెన్ గా మనసు మారడానికి కారణాలు చాలానే ఉంటాయని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
 

నాకు వీళ్లు సెట్ కారు అనుకున్నప్పుడు.. అదే సమయంలో వాళ్ల లాంటి క్వాలిటీస్ వేరే వ్యక్తిలో కనిపించినప్పుడు కూడా మనసు తొందరగా మారుతుంది. ఆ వ్యక్తిలోని అభిప్రాయాలు మీలాగే ఉండొచ్చు.  అంతేకాదు ఆ వ్యక్తులు మీకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం లేదా.. మీకు ఎక్కువ విలువ ఇవ్వడం, మీ అవసరాలను తీర్చుతుంటే కూడా మనసు మారొచ్చు.
 


డీప్ లవ్ ఉన్న సమయంలో ఉన్న సమయంలోనే  వారి లవర్ కు బ్రేకప్ చెబుతుంటారు చాలా మంది. తొందరపడి లవ్ లో పడ్డానా.. ఇది నాకు తప్పటడుగులా మారనుందా అని ఆలోచిస్తారు. అంతే కాదు చిన్న వయసులో ప్రేమలో పడితే కూడా .. వారికి ఆ బంధంపై ఆసక్తి కోల్పోవచ్చు. అలాంటి వారు ఆ బంధానికి దూరంగా ఉండాలనుకుంటారు. 

కొంతమంది లవ్ ఉన్నప్పటికీ ప్రియుడు లేదా ప్రేయసితో సానిహిత్యంగా ఉండటం అస్సలు నచ్చదు. అంతేకాదు వారితో ఉన్నప్పుడు రొమాంటిక్ గా అనిపించపోవచ్చు. ముఖ్యంగా వారితో సెక్స్ అనే ఊహ వారికి నచ్చదు. అందుచేత కూడా వారు మిమ్మల్ని దూరం చేస్తారు. 

లవ్ లైఫ్ లో చిన్న చిన్న కొట్లాటలు, తగాదాలు కామన్ గా జరుగుతుంటాయి. కానీ కొంత మంది లవర్స్ తరచుగా గొడవపడుతూనే ఉంటారు. అలాంటి సమయంలో వారికి అవన్నీ నచ్చక కూడా ఆ బంధానికి స్వస్తి చెప్పాలనుకుంటారు. తరచుగా జరిగే గొడవల వల్ల అతడు లేదా ఆమెలో ఒత్తిడి పెరిగడంతోనే వారు మిమ్మల్ని దూరం పెడతారు. 

రిలేషన్ షిఫ్ లో ఉన్న కొంతమందికి వారి ప్రేమే వారి ఎదుగుదలకు అడ్డు అని భావిస్తుంటారు. సొంతంగా ఉన్నత స్థానానికి ఎదగాలనకున్న వారికి వారి ప్రేమ అడ్డుగా ఉందనిపిస్తే.. వారి లవ్ ను వదులుకోవడానికి సిద్దపడతారు. అంతేకాదు ఫ్యూచర్ లో ఎదగాలనుకునే వారు ప్రేమకు, పెళ్లళ్లకు తక్కువ ప్రాధాన్యతనిస్తారని నిపుణులు చెబుతున్నారు.   
 

Latest Videos

click me!