ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన దగ్గర నుంచి...రాత్రి పడుకునే వరకు డబ్బు సంపాదించడం కోసమే కష్టపడుతూనే ఉంటారు. ఆ కష్టపడిన డబ్బును దాచుకొని.. తమ సంపాదన, ఆస్తిపాస్తులు పెంచుకోవాలనే చూస్తారు. కానీ.. ఇది అందరికీ సాధ్యం కాదు. అయితే.. మనం కనుక కొన్ని అలవాట్లు అలవరుచుకుంటే.. చాలా ఈజీగా మీరు మీ సంపాదన రోజు రోజుకీ పెంచుకునే అవకాశం ఉంటుంది.
మీరు మీ సంపాదన పెంచుకోవాలి అనుకుంటే.. ముందుగా.. మీరు మీ ఫైనాన్షియల్ లక్ష్యాన్ని తెలుసుకోవాలి. డబ్బు సంపాదన విషయంలో మీ లక్ష్యాలు ఏంటి..? వాటిని ఎలా పూర్తి చేయాలి అనుకుంటున్నారు అనే విషయాలను ముందుగా ఓ పేపర్ మీద పెట్టాలి. ఆ రాసుకున్న వాటిని.. మన కళ్లకు ఎప్పుడూ కనపడేలా చూసుకోవాలి. అవి కళ్ల ముందు కనపడుతూ ఉంటే.. మన లక్ష్యం మనకు ప్రతి నిమిషం గుర్తు ఉంటుంది. దాని ని సాధించడానికి కష్టపడుతూ ఉంటాం.
మీరు డబ్బు ఎక్కువగా సంపాదించాలి అంటే.. ముందుగా మీరు బడ్జెట్ ని సెట్ చేసుకోవాలి. మన ఆదాయం ఎంత..? దేని కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం..? ఎక్కడ కంట్రోల్ చేయాలి.. ఇలాంటి విషయాలన్నీ బడ్జెట్ లో పొందుపరచాలి. కొంతకాలం పాటు ఈ బడ్జెట్ ని ఇలా ట్రాక్ చేసుకుంటే.. మీకే ఒక ఐడియా వస్తుంది. ఎక్కడ ఎంత ఖర్చు చేయాలో తెలిస్తే.. ఎంత పొదుపు చేయాలో తెలుస్తుంది.
మీరు ఎంత సంపాదించినా.. ఆ సంపాదనలో అత్యవసర నిధి కింద కొంత మొత్తం దాచిపెడుతూ ఉండాలి. ఎందుకంటే.. అత్యవసర పరిస్థితి మనకు చెప్పి రాదు.. ఎప్పుడు ఎలా వస్తుందో కూడా ఊహించలేం. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒకేసారి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముందుగానే సంపాదనలో నుంచి అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలి.
మీరు మీ సంపాదన పెంచుకోవాలంటే.. మీరు ముందు జాగ్రత్త తీసకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే... అప్పులకు దూరంగా ఉండటం. వీలైనంత వరకు అప్పులకు దూరంగా ఉండాలి. అంతేకాకుండా క్రెడిట్ కార్డు బిల్లల పే చేయడంలో ఆలస్యం చేయవద్దు. ఆలస్యం చేయడం వల్ల.. ఆ బిల్లు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
మన చేతిలో డబ్బులు ఉన్నా.. మన ఎకౌంట్ లో ఎప్పుడూ కళ్ల ముందు కనపడుతుంటే.. ఖర్చు పెట్టాలనే అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక అవసరం కూడా గుర్తుకు వస్తూ ఉంటుంది. వీలైనంత వరకు కళ్ల ముందు డబ్బులు కనిపించకుండా చూసుకోవాలి. వచ్చిన జీతం వచ్చినట్లు సేవింగ్స్ లోకి వెళ్లేలా చూసుకోవాలి. అప్పుడు మీ డబ్బులు సేవ్ అవుతూనే ఉంటాయి. అనవసరపు ఖర్చులకు తెరపడుతుంది.
ఇక.. మీరు చెల్లించాల్సిన బిల్లులు ఏవైనా ఆన్ టైమ్ లో చెల్లించడం అలవాటు చేసుకోవాలి. బిల్లులు పెండింగ్ లో పెట్టే అలవాటను ఎంత వరకు తగ్గించుకుంటే అంత మంచిది. లేట్ ఫీస్ పెరిగే అవకాశం ఉంటుంది.
ఇక.. ఆదాయం పెంచుకోవడానికి ఈ రోజుల్లో చాలా పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. వాటిని తెలుసుకొని.. వాటిల్లో పెట్టుబడి పెట్టడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు.. మీ సంపాదన మరింత పెరుగుతుంది.