ప్రస్తుతం చాలా డ్రై స్కిన్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే మన చర్మం డ్రై గా మారడానికి ఎన్నో కారణాలున్నాయి. శరీరానికి సరిపడా నీరు అందకపోవడం వల్ల చర్మం పొడిబారి పగుళ్లు, ముడతలు వస్తాయి. ఇలాంటి వారు నీటిని పుష్కలంగా తాగాలి. ఎందుకంటే నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచి స్కిన్ డ్రైనెస్ ను పోగొడుతుంది. డ్రై స్కిన్ ఉండేవారు ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
27
cucumber
కీరదోసకాయ
కీరదోసకాయలను ఎండాకాలంలో పుష్కలంగా తింటారు. ఇవి మన శరీరాన్నే కాదు, చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ కీరదోసకాయల్లో 90 శాతం వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. వీటిని తింటే మీ శరీరానికి వాటర్ అందుతుంది. ఇది మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. పొడిచర్మం ఉన్నవారికి ఇది బాగా సహాయపడుతుంది.
37
avocado
అవొకాడో
అవొకాడోలో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. డ్రైస్కిన్ ఉన్నవారికి ఇది ఎంతో సహాయపడుతుంది. ఇది చర్మ సమస్యలను కూడా పోగొడుతుంది.
47
చిలగడదుంప
తీపి బంగాళాదుంపలు కూడా మన ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటాయి. చిలగడదుపం శరీరాన్నే కాదు చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
57
బచ్చలికూర
బచ్చలికూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలేట్, బీటా కెరోటిన్, విటమిన్ కె, జింక్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మంపై ముడతలను తొలగించడానికి సహాయపడతాయి. ఇది వృద్ధాప్యానికి ప్రధాన సంకేతం. ఇది చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి కూడా సహాయపడుతుంది.
67
Image: Getty Images
వాల్ నట్స్
వాల్ నట్స్ ఉండే విటమిన్ బి, విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇతర పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. చర్మ సమస్యలను తగ్గిస్తాయి. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మం వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అవుతాయి. అలాగే చర్మం కూడా అందంగా మెరిసిపోతుంది.
77
గుడ్లు
గుడ్లు మంచి పోషకాల బాంఢాగారం. గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్ ఎ, విటమిన్ బి5, విటమిన్ ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒక గుడ్డును తిన్నం పొడి చర్మం మాయం అయ్యి మీ స్కిన్ కాంతివంతంగా మెరిసిపోతుంది.