పగలంతా ఆవలింతలు, కళ్లు మూతలు పడతాయి. కానీ రాత్రి పడుకుందామంటే నిద్ర మాయం..! ఈ రోజుల్లో 10లో 8 మంది ఇదే సమస్యతో బాధపడుతున్నారు. మందులు లేకుండా, మొబైల్ చూడకుండా... సహజంగా, ప్రశాంతంగా నిద్రపోవడానికి 5 సూపర్ టిప్స్ ఇవిగో..!
పక్క మీద పడుకొని 20 నిమిషాలు దాటినా నిద్ర పట్టట్లేదా..? బలవంతంగా కళ్లు మూసుకొని అక్కడే పడుకోవద్దు. అది మీలో ఆందోళనను మరింత పెంచుతుంది. వెంటనే బెడ్ మీద నుంచి లేచి వేరే గదిలోకి వెళ్లండి. డిమ్ లైట్‌లో ఏదైనా పుస్తకం చదవండి. నిద్ర వస్తున్నప్పుడు మాత్రమే మళ్లీ వచ్చి పడుకోండి.
25
"నేను అస్సలు నిద్రపోను" అని మీకు మీరే చెప్పుకొండి
ఇదొక సైకలాజికల్ ట్రిక్. 'నాకు నిద్ర రావాలి, రావాలి' అని మీరు ఎంతగా అనుకుంటే మీ మెదడు అంత చురుగ్గా మేల్కొని ఉంటుంది. దానికి బదులుగా కళ్లు పెద్దవి చేసి 'నేను మరో 10 నిమిషాల పాటు అస్సలు నిద్రపోను, మేల్కొనే ఉంటాను' అని మీకు మీరే సవాల్ చేసుకోండి. దీంతో మీ మెదడు అలసిపోయి, మీకు తెలియకుండానే మిమ్మల్ని నిద్రపుచ్చుతుంది.
35
'4-7-8' బ్రీతింగ్ టెక్నిక్..
ఈ సింపుల్ టెక్నిక్‌తో 60 సెకన్లలో శరీరాన్ని రిలాక్స్ చేయండి. పడుకొని 4 సెకన్ల పాటు ముక్కుతో గాలి పీల్చండి. 7 సెకన్ల పాటు గాలిని లోపలే బిగపట్టండి. 8 సెకన్ల పాటు 'ఉష్' అనే శబ్దంతో నోటి ద్వారా నెమ్మదిగా గాలిని వదలండి. ఇలా 4 సార్లు చేస్తే చాలు, మీ గుండె కొట్టుకునే వేగం సాధారణ స్థితికి వస్తుంది, నరాలు శాంతించి నిద్ర పడుతుంది.
చాలా మంది నైలాన్ లేదా పాలిస్టర్ దుస్తులు వేసుకొని నిద్రపోతారు. ఇవి శరీరంలోని వేడిని బయటకు పోనివ్వకుండా చేసి, పక్కను వేడిగా మారుస్తాయి. దీనివల్ల శరీరానికి అసౌకర్యంగా ఉండి నిద్రకు భంగం కలుగుతుంది. నిద్రపోయేటప్పుడు 100% కాటన్ దుస్తులనే, అది కూడా వదులుగా ఉండే వాటిని ధరించండి. శరీరం చల్లగా ఉంటే మెదడు నిద్రకు అవసరమైన 'మెలటోనిన్' హార్మోన్‌ను దానంతట అదే విడుదల చేస్తుంది.
55
రేపటి ప్లాన్ రాసిపెట్టుకోండి..!
'రేపు ఆఫీసులో ఆ ఫైల్ ఇవ్వాలి, ఉదయాన్నే లేవాలి' వంటి ఆందోళనలే నిద్రను పాడు చేస్తాయి. పడుకునే ముందు ఒక డైరీ తీసుకొని, రేపు చేయాల్సిన పనులను, మీ ఆందోళనలను అందులో రాసేయండి. 'అన్నీ డైరీలో రాసేశాం కదా, రేపు చూసుకోవచ్చులే' అని మీ మెదడు కూడా ప్రశాంతంగా మారిపోతుంది.