Healthy Diet: ఎముకల బలం కోసం ఇవి తినండి..

Published : Mar 24, 2022, 03:25 PM IST

Healthy Diet: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు బలహీనంగా మారిపోతూ ఉంటాయి. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలతో ఎముకలను బలంగా.. దృఢంగా చేయొచ్చు.. ఎలా అంటే.. ?

PREV
111
Healthy Diet: ఎముకల బలం కోసం ఇవి తినండి..

Healthy Diet: ఒకప్పుడు వయసు మీద పడుతున్న వారికే ఎముకలకు సంబంధించిన రోగాలు వచ్చేవి. ఇక ఈ ఆధునిక సమాజంలో అలా లేదు. చిన్న వయసు వారు సైతం మోకాళ్ల నొప్పులు, ఎముకల బలహీనత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. 
 

211

ప్రతిరోజూ వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

311

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామం చేయడం సంగతి పక్కన పెడితే.. సమయానికి తిండి కూడా తినలేని పరిస్థితి దాపురించింది. ఆకలేస్తే చాలు ఏదో ఒకటి తింటూ కడుపు నింపుకుంటున్నారు.

411

మెరుగైన జీవితానికి వ్యాయామం ఎంత ముఖ్యమో.. బలమైన, పోషకవిలువలున్న ఆహారం కూడా అంతేముఖ్యం. వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. 
 

511

అయితే ఎముకలకు సంబంధించిన ఎలాంటి సమస్యలు రాకూడదంటే.. బలమైన ఆహారం తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జీవన శైలి, ఆహారపు అలవాట్లు బాగుంటే వృద్ధాప్యంలో కూడా ఎముకలు బలంగా , దృఢంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకి ఎముకల బలానికి ఎలాంటి ఆహారంలో తీసుకోవాలో తెలుసుకుందాం.. 
 

611

ఎముకల ఆరోగ్యానికి బాదం పప్పులు, పెరుగు, అరటిపండ్లు, నువ్వులు, ఆకు కూరలు, సోయా, కొవ్వు చేప, నారింజలు, ఆలివ్ నూనెలు ఎంతో సహాయపడతాయి. వీటిని క్రమం తప్పకుండా రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే ఎముకలు బలంగా ఉంటాయి. 
 

711

తృణధ్యాన్యాలు ఆరోగ్యానికి మంచివే అయినా.. వీటిలో ఫైటిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఎముకలను బలంగా ఉంచే కాల్షియం ఉండదు. అంతేకాదు వీటిని తింటే ఒంట్లో కాల్షియం తగ్గుతుంది. 

811

ఎముకలు బలంగా ఉండాలంటే చికెన్, మటన్ వంటి మాంసాలను ఎక్కువగా తినకూడదు. మాంసాహారాన్ని ఎక్కువగా తింటే ఒంట్లో కాల్షియం తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

911

కూరలో ఉప్పు ఎక్కువగా వేసుకుని తిన్నా.. ఎముకలు బలహీనంగా తయారవుతాయి. కాబట్టి ఉప్పును ఎక్కువగా ఉపయోగించకండి. 

1011

ఆల్కహాల్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆల్కహాల్ వల్ల బోలు ఎముకల వ్యాధి సోకే ప్రమాదముంది. కాబట్టి వీలైనంత తొందరగా ఆల్కహాల్ కు దూరంగా ఉండండి.

1111

కాఫీ, టీ లలో ఉండే కెఫిన్ మన బాడీలో ఉండే కాల్షియాన్ని తగ్గిస్తాయి. కాబట్టి వీటిని తాగడం తగ్గించండి. అలాగే విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల వల్ల కూడా మీ ఎముకలు బలంగా ఉంటాయి. 

click me!

Recommended Stories