పైసా ఖర్చు లేకుండా పులిపిర్లను పోగొట్టే చిట్కాలు ఇవి

First Published | Aug 27, 2024, 3:24 PM IST

పులిపిర్లు ఒక్క ముఖంపైనే కాకుండా.. మెడ, వీపు వంటి భాగాల్లోనే కాకుండా.. శరీరంలో చాలా భాగాల్లో అవుతుంటాయి. ఇవి మన అందాన్ని తగ్గిస్తాయి. అందుకే చాలా మంది వీటిని పోగొట్టడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటాయి. అయినా ఇవి అస్సలు పోవు. కానీ కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం సులువుగా పోతాయి. 

మనలో చాలా మందికి చేతులు, కాళ్లు, వేళ్లు, చంకలు, ముఖం, మెడ వంటి చాలా చోట్ల పులిపిర్లు ఉంటాయి. ఇవి ఎలాంటి నొన్పిని కలిగించవు.  హాని కలిగించవు. కానీ ఇవి చూడటానికి బాగుండవు. అందాన్ని పాడు చేస్తాయి. 

పులిపిర్లు అనేవి కొల్లాజెన్, రక్త నాళాలు కలిసి ఏర్పడతాయి. వీటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించొచ్చు. కానీ మీరు పైసా ఖర్చు లేకుండా కూడా వీటిని తొలగించొచ్చు. అది కూడా ఇంట్లో ఉన్న కొన్ని వస్తువలతో. అవేంటో తెలుసుకుందాం పదండి. 

Latest Videos


వెల్లుల్లి:  అవును వెల్లుల్లితో కూడా మీరు పులిపిర్లను పూర్తిగా పోగొట్టొచ్చు. ఇందుకోసం వెల్లుల్లి పొట్టు తీసి వెల్లి పాయల నుంచి రసం తీయండి. దీన్ని పులిపిర్ల మీ మీద రాయండి. ఇలా నిరంతరం చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లోనే పులిపిర్లు పూర్తిగా తగ్గిపోతాయి. 

ఉల్లిపాయ, వెల్లుల్లి:  పులిపిర్లను పూర్తిగా పోగొట్టడానికి ఉల్లిపాయ రసం, వెల్లుల్లి బాగా ఉపయోగపడతాయి. ఇందుకోసం ఈ రెండింటి రసాలను ఒకేదగ్గర కలిపి ఆ మిశ్రమాన్ని పులిపిర్ల మీద అప్లై చేయండి. ఇలా ఎప్పుడూ చేస్తూ ఉంటే పులిపిర్లు కనిపించకుండా పోతాయి.

యాపిల్ సైడర్ వెనిగర్: యాపిల్ సైడర్ వెనిగర్‌ తో మనం ఎన్నో పనులను చేయొచ్చు. ఇది మంచి క్లీనర్ గా కూడా పనిచేస్తుంది. అంతేకాదు దీన్ని మీరు పులిపిర్లను పోగొట్టడానికి కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం ఆపిల్ సైడర్ వెనిగర్ ను తరచుగా పులిపిర్లకు అప్లై చేస్తూ ఉంటే అవి కొన్ని రోజుల్లో మటుమాయం అవుతాయి. 

బంగాళాదుంప రసం: బంగాళాదుంప రసాన్ని ఎన్నింటికో ఉపయోగిస్తారు. మీరు దీన్ని పులిపిర్లను పోగొట్టడానికి కూడా ఉపయోగించొచ్చు. దీనికోసం మీరు బంగాళాదుంప రసాన్ని పులిపిర్ల మీద రోజూ రాస్తుంటే 3-4 రోజుల్లో అవి  ఊడిపోవడం ప్రారంభిస్తాయి. 

click me!