Power Bill: ఈ ట్రిక్స్ వాడితే కరెంట్ బిల్లు సగం తగ్గుతుంది..!

Published : Feb 12, 2025, 04:41 PM IST

సమ్మర్ వచ్చింది కదా పవర్ బిల్లు పెరగడం ఖాయం. కానీ మనం  కొన్ని ట్రిక్స్ ఫాలో  అవ్వడం వల్ల కరెంట్ ని ఆదా చేయవచ్చు. మీ బిల్లు సగం వరకు తగ్గుతుంది. అదెలాగో తెలుసుకుందాం...  

PREV
14
Power Bill: ఈ ట్రిక్స్ వాడితే కరెంట్ బిల్లు సగం తగ్గుతుంది..!

ఎండాకాలం వచ్చేసింది. బయట ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలు తట్టుకోలేక ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు ఆన్ లోనే ఉంచుతాం. దాని వల్ల.. కరెంటు బిల్లు  చాంతాడంత వచ్చేస్తుంది. కానీ... ఏం చేస్తాం.. ఇంట్లో ఉన్నా కూడా వేడి తట్టుకోలేకపోతున్నాం అని, అందుకే ఏసీ, ఫ్యాన్ వాడకుండా ఉండలేకపోతున్నాం అని చెబుతుంటారు. అయితే.. మనం కొన్ని సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వడం వల్ల.. కరెంట్ బిల్లును కంట్రోల్ చేయవచ్చు. చాలా వరకు కరెంట్ బిల్లు ఆదా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

 

24
విద్యుత్

కరెంటు బిల్లు రావడానికి మనం  ఇంట్లో వాడే కొన్ని బల్బులు కూడా కారణం కావచ్చు. అందుకే.. అక్కడి నుంచి కరెక్షన్ మొదలుపెట్టాలి. ఇప్పుడు మీరు వాడే లైట్లను మార్చేయండి. వాటికి బదులుగా... LED బల్బులు లేదా LED ట్యూబ్ లైట్లు వాడండి. 2 వాట్స్ నుండి 40 వాట్స్ వరకు LED బల్బులు దొరుకుతాయి.

34

పాత ఫ్యాన్ వాడుతుంటే, కరెంటు బిల్లు పెరగొచ్చు. పాత ఫ్యాన్‌ని మార్చేయడం మంచిది. అవి 100-140 వాట్స్ కరెంటు తీసుకుంటాయి. కానీ, ఇప్పుడు మార్కెట్లో దొరికే BLDC ఫ్యాన్లు 40 వాట్స్ మాత్రమే వాడతాయి. దీని వల్ల చాలా వరకు పవర్ సేవ్ అవుతుంది.

44

ఎండాకాలంలో ఏసీ వాడకం చాలా సర్వసాధారణం. నిజానికి, ఏసీ లేకుండా ఇంట్లో ఉండలేని పరిస్థితి. అలాంటి సమయంలో ఆన్ చేయక తప్పదు. కానీ, ఏసీ వాడినా కరెంట్ బిల్లు తక్కువ వచ్చేలా చేసుకోవచ్చు. దాని కోసం.. నార్మల్ ఏసీ వాడకూడదు.  సాధారణ AC వాడేవారు ఇన్వర్టర్ ACకి మారవచ్చు. ఇన్వర్టర్ AC పెట్టుకుంటే కరెంటు బిల్లు తగ్గుతుంది.

click me!

Recommended Stories