గాడిద పాల పనీర్.. రేటు తెలిస్తే కళ్లు తేలేస్తారు...

First Published Oct 26, 2020, 3:33 PM IST

గేదెపాలు, ఆవుపాలతో చేసే పనీర్ తెలుసు కానీ గాడిద పాలతో కూడ పనీర్ చేస్తారని మీకు తెలుసా? ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పనీర్ చాలా కాస్ట్లీ.. ఎంతంటే ఈ పనీర్ కొనే డబ్బులతో తులంన్నర బంగారం కొనుక్కోవచ్చట. 
 

గేదెపాలు, ఆవుపాలతో చేసే పనీర్ తెలుసు కానీ గాడిద పాలతో కూడ పనీర్ చేస్తారని మీకు తెలుసా? ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పనీర్ చాలా కాస్ట్లీ.. ఎంతంటే ఈ పనీర్ కొనే డబ్బులతో తులంన్నర బంగారం కొనుక్కోవచ్చట.
undefined
గాడిద పాలలో ఎన్నో ఆరోగ్య సుగుణాలున్నాయి. అందుకే గాడిదపాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. దీనివల్లే పనీర్ కూ చాలా డిమాండ్ పెరిగిందట.
undefined
తల్లిపాలలో ఉండే ఆరోగ్య లక్షణాలన్నీ గాడిద పాలలో ఉంటాయి. అంతేకాదు అనేక రకాల ఆరోగ్యసమస్యలకు గాడిదపాలు తల్లిపాలకంటే ఎక్కువగా పనిచేస్తాయి. చిన్న పిల్లలకు ఉబ్బసం లాంటి వ్యాధులు రాకుండా తాగిస్తారు. ఉబ్బసం బారిన పడిన పెద్దవారు కూడా ఈ పాలు ఎంతో మంచివి.
undefined
అందుకే లీటర్ గాడిద పాల ధర 6,7 వేల ధర పలుకుతుంది. మరి గాడిద పాలతో చేసే పనీర్ ఎక్కడ దొరుకుతుంది. దీని ధర ఎంత అంటే.. ఇది సెర్బియాలో దొరుకుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పనీర్ గా దీనికి పేరుంది. సింపుల్ గా ఈ పనీర్ కిలో ధర 78వేల రూపాయలు మాత్రమే నట.
undefined
మామూలుగా మనం వాడే ఆవు లేదా గేదె పాల పనీర్ 300 నుంచి 400 రూపాయలకు కిలో దొరుకుతుంది. కానీ ఈ గాడిద పాల పనీర్ అలా కాదు. గాడిద పాలు రేర్ కాబట్టి దాని ధర కూడా అలాగే ఉంటుందని చెబుతున్నారు.
undefined
ప్రపంచంలో అత్యంత ఖరీదైన పన్నీర్ సెర్బియా డాలోని ఒక ఫార్మ్ లో తయారుచేశారు. ఈ పనీర్ ను జసవికా అని పిలుస్తారు. అవు, గేదేలతో పోలిస్తే గాడిదలు చాలా తక్కువ పాలు ఇస్తాయి. ఒక్కో గాడిద ఒక లీటరు పాలు కూడా ఇవ్వదు.
undefined
ఉత్తర సెర్బియాలోని ఓ సేంద్రీయ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న గాడిదలన్నింటి నుండి తీసిన పాలతో ఓ కిలో పనీర్ తయారవుతుంది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. అన్ని గాడిదపాలూ పనీర్ చేయడానికి పనికి రావు. కేవలం బాల్కన్ల గాడిద పాలతో మాత్రమే పోషకాలతో కూడిన పనీర్ తయారవుతుంది.
undefined
ఈ గాడిద పాలలో అనేక పోషకాలు ఉన్నాయి. ఉబ్బసం, బ్రాంకైటీస్ రోగులకు ఇది ఎంతో మంచింది. అలెర్జీ ఉన్నవారికి గాడిద పాలు పన్నీర్ కూడా ఉపయోగించవచ్చు.
undefined
అత్యంత ఖరీధైన ఈ పనీర్ ను విదేశీయులు ఎక్కువగా వాడతారు. అంతేకాదు గాడిద పాలతో సబ్బులు, షరబ్‌లను కూడా తయారు చేస్తారు.
undefined
మొదటిసారిగా ఈ పనీర్ కి సంబంధించిన వార్తలు 2012లో వెలుగులోకి వచ్చాయి.సెర్బియా టెన్నిస్ స్టార్ జొకోవిక్ జొకోవిచ్ ఈ పనీర్ తాగాడని వార్తలు రావడంతో చర్చ మొదలయ్యింది. అయితే ఇవి తప్పుడు వార్తలని జెకోవిచ్ కొట్టి పడేశారు.
undefined
click me!