సాయంత్రం ఇలాంటి పనులు మీరు చేస్తున్నారా..?

First Published Dec 8, 2023, 1:43 PM IST

మనకు ఎదురైన సవాళ్లు ఏంటి? వాటి నుంచి మనం నేర్చుకునే గుణపాఠం ఏంటి అనే విషయం కచ్చితంగా తెలసుకోవాలి. దానికి సాయంత్రం వేళ ప్రశాంతంగా కూర్చొని మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.


ఉదయం లేవాలని, రాత్రి పడుకోవాలి అని మనకు ఎవరూ చెప్పరు. కానీ, మనం వాటిని ప్రతిరోజూ చేస్తుంటాం. అదేవిధంగా, సాయంత్రం పూట కూడా కొన్ని పనులు మనం అలవాటు చేసుకోవాలంట.  సాయంత్రం 7 తర్వాత కొన్ని పనులు చేయడం వల్ల, మన జీవితం చాలా అద్భుతంగా మారుతుందట. మరి ఆ పనులు ఏంటో, మనం అసలు ఫాలో అవుతున్నామో లేదో కూడా తెలుసుకుందాం...

మంచి అలవాట్లు మన ఆరోగ్యకరమైన జీవితానికి సహాయపడతాయనే విషయం మనకు తెలిసిందే.  అంతేకాదు, ఆ  అలవాట్లను మీ రోటీన్‌లో చేర్చడం వల్ల మీ మానసిక ఆరోగ్యం, ఉత్పాదకత , సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో మీకు సహాయపడుతుంది.
 

Latest Videos


reflection

1.ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురౌతూ ఉంటాయి. విజయాలు, సవాళ్లు ఎదురవ్వడం చాలా కామన్. అయితే, ఆ సవాళ్లు ఎదురయ్యాయని మనం కుంగిపోకూదు. మనకు ఎదురైన సవాళ్లు ఏంటి? వాటి నుంచి మనం నేర్చుకునే గుణపాఠం ఏంటి అనే విషయం కచ్చితంగా తెలసుకోవాలి. దానికి సాయంత్రం వేళ ప్రశాంతంగా కూర్చొని మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ ఆత్మపరిశీలన మీ అనుభవాలను మెరుగ్గా అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది, వ్యక్తిగత వృద్ధిని, స్వీయ-అవగాహనను పెంపొందిస్తుంది.

screen time


2. ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ డిజిటిల్ స్క్రిన్స్ కి చేరువైపోయారు. ఎవరిని చూసినా చేతుల్లో ఫోన్లే ఉంటున్నాయి. రాత్రి నిద్రపోయేవరకు ఫోన్లు, టీవీలను చూసేవారు ఉన్నారు. కానీ, డిజిటల్ స్క్రీన్‌ల నుండి విడిపోవడం కూడా చాలా ముఖ్యం. రాత్రి 7 గంటల తర్వాత ఫోన్‌లు, కంప్యూటర్‌లు , టీవీలను చూడటం మానుకోండి. బదులుగా, అనలాగ్ కార్యకలాపాలలో మునిగిపోండి, ఉదాహరణకు, డ్రాయింగ్, పెయింటింగ్ లేదా వంట చేయడం. ఈ కార్యకలాపాలు కంటి ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మానసిక విశ్రాంతిని అందిస్తాయి. ఆరోగ్యానికి కూడా ఎంతో సహాయపడతాయి.
 

do list

3. మనకు ప్రతిరోజూ ఏదో ఒక పని ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే, ఏ పనికి అయినా ప్లానింగ్ ఉంటే, మరింత మెరుగ్గా ఉంటుంది. దానికోసం మనం  మరుసటి రోజు కోసం ప్లాన్ చేయడం కూడా ఉత్పాదకతను మెరుగుపరచడానికి ఒక గొప్ప మార్గం. మీరు చేయవలసిన పనుల జాబితాను రాసుకోండి లేదా మీ లక్ష్యాలను వ్రాయండి. ఇది మీ ఆలోచనలు, పనులను నిర్వహించడానికి, ఆందోళనను తగ్గించడానికి , మీ రోజును మరింత ఉత్పాదకంగా చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
 

Breathing

4.చివరగా, శ్వాస తీసుకోవడం అనేది మీ మనస్సు, శరీరాన్ని ఏకం చేయడానికీ, మనసుకు ఓదార్పునివ్వడానికి ఒక గొప్ప మార్గం. లోతైన శ్వాస వ్యాయామాలు, యోగా లేదా ధ్యానం చేయండి. ఇవి చేయడం వల్ల  మీ హృదయ స్పందన రేటును స్థిరీకరిస్తాయి. మరింత ప్రశాంతమైన నిద్రకు మార్గం సుగమం చేస్తాయి.
 

habits

ఈ అలవాట్లను మీ రోజువారీ జీవితంలో చేర్చడానికి మీరు ప్రయత్నించవచ్చు. మీరు మీ మానసిక ఆరోగ్యం, ఉత్పాదకత పెంచుకోవచ్చు. 

click me!