కుక్కలు కార్ల టైర్లు, స్తంభాల పైనే ఎందుకు మూత్ర విసర్జన చేస్తాయో తెలుసా..?

Published : May 26, 2022, 11:31 AM ISTUpdated : May 26, 2022, 11:32 AM IST

మన మందు ఎన్నో వింత వింత చేష్టలు, పనులు జరుగుతుంటాయి. అందులో ఒకటి కుక్కలు స్తంభాలు, కార్ల టైర్ల  పైనే ఎక్కువగా మూత్రవిసర్జన చేయడం. అయితే దీని వెనుక ఒక కారణం కూడా ఉంది. అదేంటంటే..? 

PREV
15
కుక్కలు కార్ల టైర్లు, స్తంభాల పైనే ఎందుకు మూత్ర విసర్జన చేస్తాయో తెలుసా..?

కుక్కలు మనుషులకు తొందరగా మచ్చిక అయిన జీవులు. విశ్వాసంలో దీనికి మించిన మరో జీవి ఈ భూమిపై లేదంటారు పెద్దలు. అందుకే చాలా  మంది ఇండ్ల కుక్కలను పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అందులోనూ వీటిని లక్షలు పోసి కొనే వాళ్లు కూడా ఉన్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. కుక్కలు ఒక విషయంలో చాలా వింతగా ప్రవర్తిస్తుంటాయి. అదేనండి.. అవి మూత్రవిసర్జన చేసే పద్దతే కాస్త వింతగా.. విడ్డూరంగా అనిపిస్తుంటుంది. 

25

ఎక్కడ కార్ల టైర్లు.. స్తంభాలు కనిపించినా.. పరుగు పరుగున వెళ్లి ఒక కాలు పైకెత్తి దానిపైనే మూత్రవిసర్జన చేస్తుంటాయి. ఇలా ఎందుకు చేస్తాయబ్బా కుక్కలు అని చాలా మందిని డౌట్ (Doubt) వచ్చే ఉంటుంది. ఇంతకి ఇవి ఇలా ఎందుకు చేస్తాయో.. దాని వెనకున్న అసలు కారణమేందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

35

కుక్కల ప్రవర్తణ నిపుణుల అధ్యయనం ప్రకారం.. కుక్కలు స్తంభం (Pol), లేదా టైర్లపై (Tires) చేయడం ద్వారా తమ భూభాగాన్ని గుర్తిస్తాయి.  ఇది దాని ఇతర సహచరులను( ఇతర కుక్కలను) సంప్రదించే ఒక సులువైన మార్గం కూడా.  ఒక కుక్క స్తంభం లేదా టైరుపై మూత్ర విసర్జన చేసినప్పుడు అవి ఒక సమాచారాన్ని పాస్ చేస్తాయి. అంటే ఈ వాసనతో ఆ కుక్క ఉన్నట్టు తెలియజేసే గుర్తన్న మాట. ఈ వాసనను చూసిన ఇతర కుక్కలు సైతం అక్కడ తమ ముద్రను కూడా వదిలెలతాయి. 

45

కుక్కలు క్షితిజ సమాంతర ఉపరితలాల (Horizontal surfaces) కంటే నిలువు ఉపరితలాలపైనే మూత్ర విసర్జన చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాయి. టైర్ లేదా పోల్ దిగువ భాగం కుక్క ముక్కును చేరుకునే విధంగా ఉంటుంది. దీంతో అవి ఇతర కుక్కల ముక్కు స్థాయిలో తమ గుర్తును ( మూత్రం) వదిలేస్తాయి. అయితే కుక్క మూత్రం వాసన టైరులో ఎక్కువ సేపు ఉంటుంది. అదే భూమిమీద అయితే చాలా తొందరగా వాసన పోతుంది. అందుకే ఇవి టైర్లపైనే మూత్ర విసర్జన చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతాయి. 
 

55

కుక్కలు రబ్బరు టైర్లపైనే మూత్రం పోయడానికి మరొక కారణం కూడా ఉంటుంది. ఇవి రబ్బరు వాసనను ఇష్టపడతాయట. అందుకే టైర్ కనిపిస్తే చాలు దాని దగ్గరికెళ్లి మూత్ర విసర్జన చేస్తాయి.  

Read more Photos on
click me!

Recommended Stories