ముఖేష్ అంబానీతో పెళ్లికి కండీషన్ పెట్టిన నీతా అంబానీ.. అదేంటో తెలుసా?

First Published | Mar 14, 2024, 9:53 AM IST


ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఈ మధ్య తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ నుంచి. వీళ్ల పెళ్లి మరికొన్ని రోజుల్లో ఎంతో గ్రాండ్ గా జరుగనుంది. అయితే నీతా అంబానీ ముఖేష్ అంబానీనీ పెళ్లి చేసుకోవడానికి ముందు కొన్ని కండీషన్స్ ను పెట్టిందట. దానికి కట్టుబడే ముఖేష్ అంబానీ పెళ్లి చేసుకున్నారట. 
 

ముఖేష్ అంబానీ ఫ్యామిలీలో నీతా అంబానీ ఒక ముఖ్యమైన వ్యక్తి. కానీ పెళ్లి కాకముందు నీతా అంబానీ ఒక సాధారణ మహిళ.  నీతా అంబానీ టీచర్ గా తన ప్రొఫెషనల్ జర్నీని ప్రారంభించిందని.. ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్  అంబానీనీ పెళ్లి చేసుకున్నప్పటికీ.. ఈమె మాత్రం తన ఉద్యోగాన్ని వదులుకోలేదు. నీతా అంబానీ 1985 లో ముఖేష్ అంబానీని పెళ్లి చేసుకున్న వెంటనే సన్ ఫ్లవర్ నర్సరీలో బోధించడం స్టార్ట్ చేసిందట. 

Nita Ambani

పెళ్లికి ముందు నీతా అంబానీ నార్సీ మోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అయితే నీతా అంబానీ ముఖేష్ అంబానీని పెళ్లి చేసుకోవడానికి ముందు తనకు ఒక షరతు ఉందని చెప్పిందట. అదేంటంటే.. టీచింగ్ ను అలాగే కొనసాగించడానికి అనుమతించాలని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పిందట. ఆ మాటకు కట్టుబడే ముఖేష్ అంబానీ పెళ్లి చేసుకున్నారట. అందుకే నీతా వివాహం తర్వాత కూడా చాలా సంవత్సరాలు టీచర్ గా పనిచేశారు. 

Latest Videos


పెళ్లి తర్వాత సన్ ఫ్లవర్ నర్సరీలో టీచర్ గా పనిచేసినందుకు నీతా అంబానీకి నెలకు రూ.800 ఇచ్చేవారట. ఈ విషయాన్ని ఆమె 'రెండెజ్యూస్ విత్ సిమి గరేవాల్' చాట్ షోలో తెలిపారు. ఈ సమయంలో ఆమెకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎంతో మంది ఆమెను అవమానించినప్పటికీ.. ఆమె బోధనకు మాత్రం దూరం కాలేదట. ఆ సమయంలో తనను చూసి చాలా మంది నవ్వేవారని, కానీ పిల్లలకు బోధించడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని నీతా అంబానీ గుర్తు చేసుకున్నారు.
 

టీచర్ ఉద్యోగం నుంచి వచ్చే నీతా అంబానీ జీతం వాళ్ల అన్ని అవసరాలను తీర్చిందని ముఖేష్ అంబానీ వెళ్లడించారు. అలాగే  "ఆ జీతం అంతా నాది" అని సరదాగా నీతా అంబానీ చెప్పారు. అప్పటి నుంచి నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ స్కూల్స్ ను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ స్కూల్స్ ద్వారా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని లక్ష్యం పెట్టుకున్నారు. 
 

ఈ పాఠశాలలు జామ్నగర్, సూరత్, వడోదర, దహేజ్, లోధివాలి, నాగోథానే, నాగ్పూర్, నవీ ముంబైతో సహా వివిధ ప్రదేశాలలో విస్తరించి ఉన్నాయి. చదువు పట్ల అంకితభావంతో ఎంతో మంది పిల్లలు, కుటుంబాల జీవితాల్లో నీతా అంబానీ సుస్థిర ప్రభావం చూపారు. వారికి మంచి భవిష్యత్తును ఇవ్వడానికి తోడ్పడుతున్నారు.  నీతా అంబానీ మంచి డ్యాన్సర్ కూడా. ఈమె శిక్షణ పొందిన భరతనాట్య నృత్యకారిణి. చిన్నతనం నుండే నీతా భరతనాట్యం చేసేవారు. 

click me!