తలనొప్పే అని తేలిగ్గా తీసిపారేయకండి.. ఇది ప్రాణాంతక వ్యాధి సంకేతం కావొచ్చు..

Published : Mar 10, 2022, 02:09 PM IST

Headache: తరచూ తలనొప్పి వస్తుంటే దాన్ని లైట్ తీసుకున్నారా? జాగ్రత్త.. అది ప్రాణాంతకమైన బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి సంకేతం కావొచ్చు..   

PREV
16
తలనొప్పే అని తేలిగ్గా  తీసిపారేయకండి.. ఇది ప్రాణాంతక వ్యాధి సంకేతం కావొచ్చు..

Headache: ప్రస్తుత కాలంలో తలనొప్పి అతి సాధారణ సమస్యగా మారింది. అందుకే ఈ సమస్యను జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. పనిలో ఒత్తిడి, నిద్రలేమి, హెవీ వర్క్, మైగ్రేన్, ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం వంటి కారణాల వల్ల హెడేక్ వస్తుంది. అందుకే ఈ సమస్యను లైట్ తీసుకుంటున్నారు జనాలు. కానీ ఈ తలనొప్పి ఓ ప్రాణాంతక వ్యాధికి సంకేతం అని ఎవరూ గుర్తించడం లేదు.

26

అవును తరచుగా తలనొప్పి వస్తుంటే దాన్ని తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే ఇది బ్రెయిన్ ట్యూమర్ వ్యాధికి సంకేతమని నిపుణులు చెబుతున్నారు. Brain లో tumors(కణితులు) ఏర్పడినప్పుడు మొదట కనిపించే లక్షణం తలనొప్పే కాబట్టి దాన్ని తేలిగ్గా తీసిపారేయొద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి వల్లే తరచుగా తలనొప్పి తీవ్ర స్థాయిలో వస్తుందని నిపుణులు చెబతున్నారు. 
 

36

కణితులు ఎలా ఏర్పడుతాయి: Brain లోని  Cells విపరీతంగా పెరిగడం వల్ల  tumors ఏర్పడుతాయట. అయితే బ్రెయిన్ లో పెరిగిన కణాలు దెబ్బతినప్పుడు లేదా వాటి ఏజ్ అయిపోయినప్పుడు అవి నశించిపోతాయి. వాటి స్థానంలోనే కొత్త కణాలు మళ్లీ పుడుతాయి. కొన్ని కొన్ని సార్లు ఈ ప్రాసెస్ సాఫీగా సాగదట. అప్పుడు దెబ్బతిన్న Cells విపరీతంగా పెరిగి అవే  ఒక కుప్పగా మారి కణితులు (tumors) తయారువుతాయి. ఏ అవయవాల్లో ఈ గడ్డలు ఏర్పడుతాయో ఆ అవయవం సరిగ్గా పనిచేయదు. ఈ సమస్యను సకాలంలో గుర్తించి వైద్యం చేయించుకోకపోతే మాత్రం .. ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. 
 

46

లక్షణాలు: 

విపరీతమైన తలనొప్పితో బాధపడటం. అంటే కొన్ని కొన్ని సార్లు ఆ తలనొప్పి రోజంతా ఉంటుంది. మైకంగా ఉండటం. వాతులు, వికారంగా ఉండటం. ఒక్కో సారి మూర్ఛ కూడా వస్తుంది.  మాటతీరులో మార్పు వస్తుంది. అంటే మాట్లాడటానికి రాకపోవడం. ప్రవర్తించే తీరులో కూడా మార్పు వస్తుంది. ఈ సమయంలో పక్షవాతం బారిన పడే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. 
 

56

బ్రెయిన్ ట్యూమర్స్ ను అంత తేలిగ్గా గుర్తించలేము. ఇవి రోజులో, నెలలో బయటపడవు. ఆ కణితులు సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ పెరుగుతూనే ఉంటుంది.  అవి ముదిరాకనే దీని లక్షణాలు కనిపిస్తాయి. 

66

చికిత్స ఎలా:  బ్రెయిన్ ఎక్కడ, దాని పరిమాణం ఎంత అన్న విషయాలపై వైద్యం ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తుపడితే.. ఈ వ్యాధి నుంచి బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈ కణితులను తొలగించినా.. మళ్లీ  పుట్టుకొస్తాయట. మరికొన్ని  tumors తొలగించలేని విధంగా ఉంటాయట. వీటిని తొలగించడానికి వైద్యులు, కీమోథెరపీ, సర్జరీలు, రేడియేషన్ థెరపీ వంటి పద్దతులను ఉపయోగిస్తున్నారు. 

click me!

Recommended Stories