ఇక ఈ కథనాన్ని 'న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో' పబ్లిష్ చేశారని కూడా ప్రచారం కూడా జరిగింది. అయితే అసలు అలాంటి ఒక జర్నల్ లేదని తేలింది. కాగా ఈ కథనాన్ని వీక్లీ వరల్డ్ న్యూస్ అనే అమెరికన్ టాబ్లాయిడ్‌లో 1997లో, 2000లో ప్రచురించింది. ఈ పత్రిక అసలు నిజాల్ని కాకుండా… ఊహలు, విచిత్రమైన కథలు, అసత్య కథనాలను పబ్లిష్ చేస్తూ పాపులర్ అయ్యింది. కాబట్టి ఈ కథనం పూర్తిగా సత్యదూరమైంది. ఇందులో ఏమాత్రం శాస్త్రీయ ఆధారాలు లేవు. అసలు ఇలాంటి ఓ పరిశోధన నిర్వహించారనే దానికి కూడా ఆధారాలు లేవు. ఇంకా చెప్పాలంటే కారెన్ వెదర్‌బై అనే శాస్త్రవేత్తే లేరు. కాబట్టి ఇలాంటి కథనం సోషల్ మీడియాలో ఎక్కడైనా కనిపిస్తే అస్సలు నమ్మకండి.