Instant Noodles:ఆకలి నుంచి పుట్టిన నూడిల్స్ మొదట ఎవరు కనిపెట్టారు..? ఎవరి కోసం కనిపెట్టారో తెలుసా?

Published : Oct 22, 2026, 05:35 PM IST

Instant Noodles: చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరికీ నూడిల్స్ ఇష్టమే. బ్రేక్ ఫాస్ట్ గా, ఈవెనింగ్ స్నాక్ గా తినే ఈ నూడిల్స్ ని మొదట ఎవరు కనిపెట్టారో తెలుసా? ఎవరి కోసం ఆలోచించి కనిపెట్టారో తెలుసా?

PREV
13
నూడిల్స్ కథ తెలుసా?

హెల్దీ, అన్ హెల్దీ అనే విషయం పక్కన పెడితే... మనలో చాలా మంది రెగ్యులర్ గా ఇన్ స్టాంట్ నూడిల్స్ ని తింటూ ఉంటారు. వీటిని చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. వంట చేయడం రాని వాళ్లు కూడా చాలా ఈజీగా చేయగలరు. అంతేకాకుండా, రుచికి కూడా బాగుంటాయి. ఇంత మంది ఇష్టంగా తినే ఈ నూడిల్స్ తయారీ వెనక పెద్ద కథే ఉందని మీకు తెలుసా? ఇది ఒక రుచికరమైన ఫుడ్ మాత్రమే కాదు, ఒక యుద్ధం తర్వాత పుట్టిన ఆకలి కేకల నుంచి ఉద్భవించిన అద్భుతమైన ఆహారం. మరి, ఈ నూడిల్స్ ని మొదట ఎవరు కనిపెట్టారు? ఎవరి కోసం దీనిని మొదటిసారి తయారు చేశారు..?

23
మొదటిసారి నూడిల్స్ ఎవరు తయారు చేశారు..?

ప్రపంచాన్ని ఇష్టంతో ఊపేస్తున్న ఇన్ స్టాంట్ నూడిల్స్ ని మోమోపకు ఆండో అనే జపనీస్ వ్యాపారేవత్త కనిపెట్టారు. ఇప్పుడంటే.. మనం అందరం.. నూడిల్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి.. దానిని నీటిలో వేసి రెండు నిమిషాల్లో వండేస్తున్నాం కానీ, దీనిని తయారు చేయడానికి మోమోపకు ఆండో చాలా కష్టపడ్డారు. 1958లో జపాన్ లోని ఒసాకాలో తన ఇంటి వెనక ఉన్న ఒక చిన్న షెడ్ లో నెలల తరబడి ప్రయోగాలు చేసి, ప్రపంచపు తొలి ఇన్ స్టాంట్ నూడిల్స్ చికెన్ రామెన్ ని ఆయన ప్రపంచానికి పరిచయం చేశారు. ఫ్లాష్ ప్రైయింగ్ పద్ధతి ద్వారా నూడిల్స్ లో తేమను తొలగించి, రుచిని అలాగే ఉంచే టెక్నిక్ ని ఆయన కనిపెట్టారు.

33
ఎవరి కోసం కనిపెట్టారు..?

మార్కెట్ లో తన వ్యాపారం పెంచుకోవడానికి ఆయన ఈ నూడిల్స్ కనిపెట్టలేదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత.. తీవ్రమైన ఆహార కొరతతో అల్లాడడిపోయిన సాధారణ ప్రజల ఆకలి తీర్చడం కోసం ఆయన దీనిని తయారు చేశారు. 1940ల చివరిలో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జపాన్ తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంది. తినడానికి తిండి లేక ప్రజలు రోడ్లపాలయ్యారు. ఆ సమయంలో జపాన్‌లోని ఒసాకా వీధుల్లో కేవలం ఒక బౌల్ వేడి వేడి సూప్ కోసం జనం చలిలో గంటల తరబడి క్యూ కట్టడం ఆయన కంట పడింది. ఆ దృశ్యం ఆయనను తీవ్రంగా కలచివేసింది.

ధనిక, పేద తేడా లేకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ ఆకలి తీర్చుకునేలా... తక్కువ ఖర్చుతో, ఎవరి సహాయం లేకుండా క్షణాల్లో వేడి నీళ్లతో తయారుచేసుకునేలా, ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఒక ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఆయన దీనిని తయారు చేయడం విశేషం.

అలా యుద్ధం కారణంగా ఆకలితో అల్లాడుతున్న సామాన్యుల కష్టాన్ని తీర్చడానికి పుట్టిన ఆ చిన్న ప్రయోగమే ఇన్ స్టాంట్ నూడిల్స్. ఈ రోజు చాలా రకాల ఫ్లేవర్స్ లో మనకు లభిస్తోంది. చాలా మందికి కంఫర్ట్ ఫుడ్ గా మారిపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories