hair care
చాలా మంది జుట్టు ఆరోగ్యం కోసం రకరకాల నూనెలను ట్రై చేస్తుంటారు. మార్కెట్ లోకి వచ్చిన ప్రతి కొత్తరకం హెయిర్ ఆయిల్ ను ట్రై చేసేవారున్నారు. ఏదేమైనా జుట్టు పొడుగ్గా, నల్లగా నిగనిగలాడాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. అయితే ఇందుకోసం దానిమ్మ నూనె మీకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అవును మీ జుట్టుకు దానిమ్మ నూనెను వాడటం వల్ల జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. అలాగే నల్లగా ఉంటుంది. జుట్టు ఊడిపోయే ప్రమాదం కూడా తప్పుతుంది. మరి జుట్టుకు దానిమ్మ నూనె ఎలా ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
హెయిర్ ఫోలికల్స్ ను ప్రేరేపిస్తుంది
దానిమ్మ గింజల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ నూనెను నెత్తికి అప్లై చేయడం వల్ల మీ నెత్తిమీద రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో మీ జుట్టు కుదుళ్లకు మంచి పోషణ అందుతుంది. అలాగే మీ జుట్టు కూడా బాగా పెరుగుతుంది.
జుట్టును బలోపేతం చేస్తుంది
ఈ దానిమ్మ గింజల నూనెలో ప్యూనిక్ యాసిడ్ తో పాటుగా ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి మీ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. అలాగే మీ జుట్టు తెగిపోకుండా కాపాడుతాయి. ఈ నూనెను వాడితే మీ జుట్టు దెబ్బతినే అవకాశం చాలా తక్కువ. అంతేకాకుండా ఈ నూనె మీ జుట్టు బలంగా, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది.
Image: Getty
చుండ్రును తగ్గిస్తుంది
దానిమ్మ గింజల నూనెలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మీ నెత్తి మీద ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాకుండా చుండ్రును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. జుట్టు పెరగాలన్నా, జుట్టు రాలకూడదన్నా నెత్తిమీద చుండ్రు ఉండకూడదు.
Image: Getty
కాంతివంతంగా చేస్తుంది
దానిమ్మ గింజల నూనె ఒక సహజ ఎమోలియెంట్. అంతే ఈ నూనె మీ జుట్టును తేమగా ఉంచుతుంది. అలాగే మృదువుగా, సిల్కీగా చేస్తుంది. ఈ నూనెను వాడితే మీ జుట్టు అందంగా మెరుస్తుంది.
Image: Getty
పర్యావరణ కాలుష్యం నుంచి రక్షణ
దానిమ్మ గింజల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జుట్టును యూవీ కిరణాలు, పర్యావరణ కాలుష్య కారకాల నుంచి రక్షిస్తాయి. జుట్టును హానికరమైన ప్రభావాల నుంచి కాపాడటానికి దానిమ్మ నూనె మీకెంతో సహాయపడుతుంది. ఈ నూనెను వాడితే మీ జుట్టు సన్నబడే అవకాశమే ఉండదు. అలాగే జున్న రాలే ఛాన్స్ కూడా తగ్గుతుంది.