చెరుకు రసంతో.. మచ్చలేని చర్మం, అందమైన జుట్టు మీ సొంతం..!

First Published May 26, 2023, 3:47 PM IST

ఎండాకాలంలో చెరుకు రసాన్ని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. మీకు తెలుసా? చెరుకు రసంతో ఎన్నో చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు కూడా పోతాయి. 
 

sugarcane juice

చెరుకు రసం మన ఆరోగ్యానికే కాదు.. చర్మానికి, జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. పోషకాలతో నిండిన చెరుకు రసం మిమ్మల్ని మరింత అందంగా మారుస్తుంది. చెరుకు రసాన్ని చర్మం, జుట్టుకు అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, దానిని ఉపయోగించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

sugarcane juice

మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది 

చెరకు రసంలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను ఎదుర్కోవడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. చెరుకులో ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు ఉంటాయి. ఇది బ్యాక్టీరియా పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. సెబమ్ ను తొలగిస్తుంది. దీని సహజ ఆమ్లాలు రంధ్రాలను మూసివేయడానికి.. అదనపు నూనె ఉత్పత్తిని తగ్గించడానికి, బ్లాక్ హెడ్స్,  వైట్ హెడ్స్ ఏర్పడకుండా నిరోధించడానికి సహాయపడతాయి. చెరుకు రసాన్ని క్రమం తప్పకుండా వాడటం వల్ల మొటిమలు, మొటిమల మచ్చలు తగ్గిపోతాయి. అలాగే మీరు అందంగా మారిపోతారు. 
 

మాయిశ్చరైజ్స్, హైడ్రేట్స్

చెరుకు రసం చర్మానికి అద్భుతమైన నేచురల్ మాయిశ్చరైజర్. దీనిలోని అధిక గ్లైకోలిక్ యాసిడ్ కంటెంట్ చర్మం తేమను నిలుపుకోవడానికి, చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి, పొడిబారకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. చెరుకును క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల పొరలుగా ఉండే చర్మం, డల్ నెస్, పాచెస్ వంటి చర్మ సమస్యలు తగ్గిపోతాయి. 
 

వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేస్తుంది

చెరుకు రసంలో ప్రోటీన్లు, ఖనిజాలు, ఐరన్, జింక్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ను నివారిస్తుంది. చెరుకు రసంలో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని నివారించడానికి సహాయపడతాయి. ఇది సన్నని గీతలు, ముడతలు, వయస్సు రీత్యా వచ్చిన మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది. చెరుకు రసం మీరు యవ్వనంగా, అందంగా కనిపించేలా చేస్తుంది. మీ స్కిన్ రంగును కూడా మెరుగుపరుస్తుంది. 
 

Sugarcane juice

చనిపోయిన కణాలను తొలగిస్తుంది

చెరుకు రసంలో ఉండే సహజ ఆల్ఫా-హైడ్రాక్సీ ఆమ్లాలు చర్మాన్ని సున్నితంగా ఎక్స్ఫోలియేట్ చేస్తాయి. అలాగే మృత కణాలు, మలినాలను తొలగిస్తాయి. దీంతో మీ చర్మం తెల్లగా మారుతుంది. ఇది మీ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. చెరుకు రసంతో క్రమం తప్పకుండా ఎక్స్ఫోలియేషన్ చేయడం వల్ల చర్మం ఆకృతి మెరుగుపడుతుంది. 
 

గాయాలను నయం చేస్తుంది

చెరుకు రసంలో గాయాలను నయం చేసే లక్షణాలు ఉంటాయి. ఇది రికవరీ ప్రక్రియను ఫాస్ట్ చేయడానికి సహాయపడుతుంది. విటమిన్ సి తో సహా చెరకు రసంలో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు, శోథ నిరోధక సమ్మేళనాలు మంటను తగ్గించడానికి, కణజాల మరమ్మత్తును ప్రోత్సహించడానికి సహాయపడతాయి. 

జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది

చెరుకు రసం జుట్టును హైడ్రేట్ చేస్తుంది. అలాగే కండిషన్ చేస్తుంది. చుండ్రును కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఇది జుట్టు బాగా పెరిగేందుకు సహాయపడుతుంది. విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు వంటివి చెరకు రసంలో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషణను అందిస్తాయి. దీంతో మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చెరుకు నేచురల్ కండీషనర్ గా పనిచేస్తుంది. చెరుకు రసం వెంట్రుకలను షైనీగా, మృదువుగా చేస్తుంది. 
 

click me!