Radhika Merchant: ఎవరి మీదా ఆధారపడి బతకకూడదు, అంబానీ కొడుకుతో పెళ్లిపై తొలిసారి స్పందించిన కోడలు

Published : Jun 16, 2026, 09:39 AM IST

 Radhika Merchant: ముఖేష్ అంబానీ కి ఎలా అయితే స్పెషల్ గా పరిచయం అవసరం లేదు.. ఆయన చిన్న కోడలు రాధిక మర్చంట్ కి కూడా అలానే పరిచయం అవసరం లేదు. తాజాగా రాధిక మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

PREV
13
అంబానీ చిన్న కోడలు...

ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రెండేళ్ల క్రితం రాధిక మర్చంట్ ని వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం 2024లో అత్యంత గ్రాండ్ గా చేశారు. ఆ సమయంలో.. రాధిక మర్చంట్ నెట్టింట బాగా వైరల్ అయ్యింది. అనంత్ అంబానీ... అంత లావుగా ఉన్నా కూడా.. కేవలం డబ్బు కోసమే రాధిక అతనిని పెళ్లి చేసుకుంది అంటూ చాలా మంది కామెంట్స్ చేశారు. అయినా.. ఆ కామెంట్స్ ని రాధిక పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా.. తన పెళ్లి గురించి, భర్త గురించి, ఆడ పిల్లలు ఆర్థికంగా స్వాతంత్రంగా ఎందుకు నిలబడాలి అనే విషయాలను తెలియజేసింది.

ఇటీవల భారతదేశంలోని అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి ఉద్యమం ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ మీటింగ్ లో రాధిక మాట్లాడారు. వివాహంలో సమానత్వం, మహిళలకు ఆర్థిక సమానత్వం ఎందుకు ముఖ్యమో ఆమె వివరించారు. మహిళలు ఇతరుల మీద ఎప్పుడూ ఆధారపడకూడదని, జీవితంలో సొంత నిర్ణయాలు తీసుకోవాలని రాధిక అన్నారు.

23
అనంత్ తో పెళ్లి గురించి తొలిసారి..

అనంత్ అంబానీతో పెళ్లి గురించి రాధిక తొలిసారి స్పందించారు. భార్యాభర్తలు కొన్ని విషయాల్లో రాజీపడినప్పటికీ, ఇద్దరూ తమ బంధానికి సమానంగా సహకరించాలని.. అప్పుడే వారి బంధం బలంగా ఉంటుంది అని రాధిక అన్నారు. ‘ నా పెళ్లి విషయంలో కూడా నేను, అనంత్ అన్ని విషయాల్లోనూ సమానమే. కొన్ని విషయాల్లో అనంత్ తగ్గుతాడు. మరి కొన్ని విషయాల్లో నేను కాస్త వెనక్కి తగ్గుతాను.కానీ.. మేము ఒకరికి మరొకరం ఎప్పుడూ గౌరవం ఇచ్చుకుంటాం. అందుకే ఇద్దరం సమానం’ అని రాధిక చెప్పారు.

33
ఎవరిమీదా ఆధారపడకూడదు..

మహిళలు ఎవరి కూతురు అయినా, ఎవరి కోడలు అయినా కూడా డబ్బు విషయంలో మాత్రం ఎవరి మీదా ఆధారపడకూడదు అని రాధిక అన్నారు.‘ మీరు ఎవరి కూతురు అయినా, ఎవరి భార్య అయినా, మీకు జీవితంలో ఎన్ని సౌకర్యాలు ఉన్నా కూడా అది ముఖ్యం కాదు. మీరు జీవితంలో మీ కోసం మీరు ఏదైనా సొంత నిర్ణయాలు తీసుకోవాలి అంటే.. మీరు ఆర్థికంగా ఎదిగి చూపించాలి.. డబ్బు విషయంలో ఇతరుల మీద ఆధారపడకూడదు.మహిళలకు ఆర్థిక స్వాతంత్రం లేకపోతే.. వారు ఎప్పటికీ ఇతరులతో సమానం కాలేరు. దీని వల్ల జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది’ అని రాధిక చెప్పారు.

రాధిక అంబానీ కోడలు అయినప్పటికీ.. జీవితంలో అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నప్పటికీ..తనకు తానుగా ఎదుగుతోంది. అంబానీ కోడలిగా కాకుండా.. మహిళా వ్యాపారవేత్తగా తన గుర్తింపు తాను సంపాదించుకుంటోంది. తనలాగా.. అందరు మహిళలు ఆర్థికంగా ఎదగాలని రాధిక సలహా ఇచ్చారు.

Read more Photos on
click me!

Recommended Stories