చేతిలో ఎప్పుడూ డబ్బులు ఉండాలంటే ఏం చేయాలి..?

Published : Feb 08, 2022, 01:52 PM ISTUpdated : Feb 08, 2022, 01:54 PM IST

మనం కావాలి అనుకున్నా కూడా.. కొన్నిసార్లు మన దగ్గర డబ్బు నిలవదు.  దాని కోసం ఏం చేయాలి..? ధనవంతులం కాకపోయినా.. మనం కంఫర్ట్ బతికేలా డబ్బు మన దగ్గర ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

PREV
16
చేతిలో ఎప్పుడూ డబ్బులు ఉండాలంటే ఏం చేయాలి..?

ప్రతి ఒక్కరూ ధననవంతులు కాలేరు. అయితే.. కనీసం హాయిగా జీవించడానికైనా డబ్బులు అవసరమే కదా. డబ్బు వద్దు అనుకునేవారు ఎవరు ఉంటారు. అయితే.. మనం కావాలి అనుకున్నా కూడా.. కొన్నిసార్లు మన దగ్గర డబ్బు నిలవదు.  దాని కోసం ఏం చేయాలి..? ధనవంతులం కాకపోయినా.. మనం కంఫర్ట్ బతికేలా డబ్బు మన దగ్గర ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
 

26

చాలా మంది తమ వ్యాలెట్స్ లో.. పనికొచ్చినవీ.. రానివీ ఇలా పరమ చెత్తంతా కూడపెడతారు. అయితే.. పర్సులో ఎప్పుడూ చెత్త ఉంచకూడదట. ఎప్పటికప్పుడు.. వ్యాలెట్ ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పనికి రాని కాగితాలను ఉంచకపోవడం మంచిదే. అవి తీసేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. డబ్బును కూడా చాలా నీట్ గా పెట్టుకోవాలి. ఎలా పడితే అలా కాకుండా.. క్రమబద్దీకరణలో పెట్టుకోవాలి. పనికి రానివి ఏవీ వ్యాలెట్ లో ఉంచుకోకపోవడేమ ఉత్తమం.
 

36

ఇక.. డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నాం అనేది చాలా ముఖ్యం. మనం డబ్బుకి విలువ ఇచ్చినప్పుడే.. అది మన దగ్గర నిలుస్తుంది. కాబట్టి.. చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఎలా పడితే అలా ఖర్చు పెట్టడం మంచిది కాదు. మనం ఎందుకు ఎంత ఖర్చు పెడుతున్నామనే విషయంలో మనకు క్లారిటీ ఉండాలి. ఏదైనా వస్తువు ఆర్డర్ చేస్తున్నామంటే.. అది నిజంగా మనకు ఎంత అవసరం అనే విషయాన్ని కచ్చితంగా ఆలోచించాలి. అదనపు ఖర్చులు  చేయకూడదు. దేనికి ఎంత ఖర్చు పెట్టొచ్చో.. అంతే పెట్టాలి.
 

46

అంతేకాదు.. ఎప్పుడూ మన దగ్గర ఉన్నదాని పట్ల చాలా తృప్తిగా ఉండాలి. మన దగ్గర ఉన్న దానిని తక్కువ చేయకూడదు. మన వద్ద ఉన్నదానిని అభినందిస్తూనే,... భవిష్యత్తులో రాబోయేదాని పట్ల కూడా కృతజ్ఞత గా ఉండాలి.

56

డబ్బు విషయంలో మనం ఉపయోగించే పదాలు కూడా మనపై అలాంటి ప్రభావమే చూపిస్తాయట. మన దగ్గర లేదు.. లేదు అనుకుంటూ ఉంటే లేకుండా పోతుందట. కాబట్టి.. ఉపయోగించే పదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు డబ్బును మానిఫెస్ట్ చేయాలనుకున్నప్పుడు, సానుకూల ధృవీకరణలను ఉపయోగించండి ఎందుకంటే మీరు మీ పదాలను తెలివిగా , స్పృహతో ఎంచుకోవచ్చు. ఇది మీరు వేరే విధంగా ఆలోచించే విధానాన్ని మారుస్తుంది.
 

66

డబ్బు గురించి మీరు ఎలా భావిస్తున్నారో ఖచ్చితంగా తెలియజేస్తుంది. మీ ఆర్థిక స్థితి చాలా తక్కువగా ఉందని మీరు భావించే పరిస్థితుల్లో కూడా, ఇది అపరిమిత మూలం. ఇది ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని మీరు నమ్మాలి. మీ మనస్సును శుభ్రపరచుకోండి, భయాలను వదిలించుకోండి. సానుకూలమైన వాటి కోసం మాత్రమే ఎదురుచూడండి.

click me!

Recommended Stories