ఈ నియామక ప్రక్రియలో రాతపరీక్షతో పాటు సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు నిర్వహించే ఐదు రోజుల వ్యక్తిత్వ పరీక్ష ఉంటుంది. ఎన్డీఏ ప్రవేశ పరీక్షలో గణితం, జనరల్ ఎబిలిటీలపై రాతపరీక్షలు ఉంటాయి. సీడీఎస్ విభాగంలో ఆంగ్లం, సాధారణ పరిజ్ఞానం, ప్రాథమిక గణిత అంశాలను పరీక్షిస్తారు. వీటిలో ప్రతిభ చూపిన అభ్యర్థులను ఎస్ఎస్బీ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఆర్మీ ఎప్పుడూ కేవలం క్లాస్రూమ్ టాపర్ల కోసం చూడదు, సంక్షోభ సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకునే బాధ్యత గల సమర్థవంతమైన నాయకులకు ప్రాధాన్యత ఇస్తుంది. సైకాలజీ పరీక్షలు, క్షేత్రస్థాయి గ్రూప్ టాస్కులు, ముఖాముఖి ద్వారా అభ్యర్థుల్లోని నైతిక విలువలు, శారీరక దృఢత్వం, ఆలోచనా తీరును క్షుణ్ణంగా అంచనా వేస్తారు.