ఇలాంటి ప్రశ్నల ద్వారా ఇంటర్వ్యూ బోర్డు అభ్యర్థి ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. తెలిసిన సమాధానాన్ని వెంటనే చెప్పడం కంటే, ప్రశ్న పరిధిని అర్థం చేసుకుని, తార్కికంగా విశ్లేషించడం ముఖ్యం. ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాల్లో ఒకే సమస్యను బహుళ కోణాల్లో చూసి, ఆధారాలతో నిర్ణయం తీసుకునే సామర్థ్యం చాలా అవసరం.
ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి ప్రశ్నలకు సమాధానమిచ్చేటప్పుడు సాధారణీకరించడం (generalize) మంచిది కాదు. ‘పొడవుగా ఉన్నవాళ్లంతా ఎక్కువ తింటారు’ లేదా ‘ఎత్తుకు, ఆహారానికి సంబంధమే లేదు’ అని రెండు తీవ్రమైన అభిప్రాయాలు చెప్పే బదులు, ‘ఎత్తు ఒక కారణం కావచ్చు, కానీ అదే నిర్ణయాత్మక అంశం కాదు’ అని సమతుల్యమైన సమాధానం ఇవ్వాలి.
మొత్తంగా యూపీఎస్సీ ఇంటర్వ్యూలో కొన్నిసార్లు సింపుల్‌గా కనిపించే ప్రశ్నలే మన ఆలోచనా విధానాన్ని పరీక్షిస్తాయి. కాబట్టి ప్రశ్న ఎంత సులభంగా ఉన్నా కంగారు పడకుండా, దాన్ని అర్థం చేసుకుని, తార్కికంగా సమాధానం ఇవ్వడం మంచిది.