తెలంగాణలో కొలువుల జాతర.. త్వరలో వేల ఉద్యోగాల భర్తీ.. పోస్టుల వివరాలివే

First Published | May 24, 2022, 3:42 PM IST

తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీలలో నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. ఉస్మానియా, జేఎన్‌టీయూహెచ్‌, కాకతీయ ఇతర యూనివర్సిటీలలో నాన్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయాలని  సీఎం కేసీఆర్‌ ఉన్నత విద్యాధికారులు, యూనివర్సిటీ అధికారులను ఆదేశించారు.

ఉన్న యూనివర్సిటీలలో  2,774 నాన్‌ టీచింగ్‌ పోస్టులు రిక్రూట్  చేయాల్సి ఉండగా అత్యధికంగా  హైదరాబాద్ తార్నాకలోని ఓయూలో 2,075 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నాన్‌ టెక్నికల్‌ పోస్టులలో జూనియర్‌ అసిస్టెంట్లు, అంతకంటే పై క్యాటగిరీ పోస్టులను మాత్రమే భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఓయూలో  680 పైగా జూనియర్‌ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి అవకాశం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. జేఎన్‌టీయూహెచ్‌లో 115, కాకతీయలో 174 నాన్‌ టీచింగ్‌ పోస్టులను రిక్రూట్  చేయాల్సి ఉంది.

తెలంగాణలో 80 వేలకు పైగా పోస్టులను  భర్తీ చేయనున్నట్లు తెలంగాణ సి‌ఎం కే.చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. ఇప్పటికే పలు నోటిఫికేషన్లను అధికారులు విడుదల చేశారు. 


పోలీస్ ఉద్యోగలకు సంబంధించి 17 వేలకు పైగా పోస్టుల  భర్తీకి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. విద్యుత్ శాఖలోనూ 1200లకు పైగా పోస్టుల భర్తీకి సంబంధిత అధికారులు నోటిఫికేషన్లను విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కోనసాగుతోంది. గ్రూప్-4 కు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు.
 

యూనివర్సిటీల వారీగా పోస్టుల వివరాలు: మొత్తం  2774
*ఉస్మానియా- 2075
*కాకతీయ- 174
*తెలంగాణ- 9
*మహాత్మాగాంధీ- 9
*శాతవాహన- 58
*పాలమూరు- 14
*పీఎస్టీయూ- 84
*బీఆర్‌ఏవోయూ- 90
*జేఎన్‌టీయూహెచ్‌- 115
*జేఎన్‌ఏఎఫ్‌యూ- 53
*ఆర్జీయూకేటీ- 93

Latest Videos

click me!