SBI Jobs:ఎస్‌బి‌ఐలో భారీగా ఉద్యోగాలు! నెలకు రూ. 41వేల జీతం.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..

First Published | May 20, 2022, 4:53 PM IST

దేశంలోని ప్రముఖ ప్రభుత్వరంగా బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)ఒప్పంద ప్రాతిపదికన 642 ఛానల్ మేనేజర్ పోస్టుల కోసం SBI రిటైర్డ్ అధికారుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించింది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ జూన్ 7. అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థులందరూ SBI అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీ పోస్టుల వివరాలు
ఛానెల్ మేనేజర్ ఫెసిలిటేటర్-ఎనీటైమ్ ఛానెల్స్ (CMF-AC): 503 పోస్ట్‌లు
ఛానెల్ మేనేజర్ సూపర్‌వైజర్-ఎనీటైమ్ ఛానెల్స్ (CMS-AC): 130 పోస్ట్‌లు
సపోర్ట్ ఆఫీసర్-ఎనీటైమ్ ఛానెల్స్ (SO-AC): 08 పోస్టులు
 

SBI ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి
మొదట sbi.co.inలో SBI అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి
హోమ్‌పేజీలో కెరీర్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
తరువాత జాబ్ ప్రకటన కోసం చూడండి ఆపై అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి
ఇప్పుడు రిజిస్టర్ చేసుకోని అలాగే దరఖాస్తుతో కంటిన్యూ చేయండి
ఇక్కడ అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి
భవిష్యత్ ఉపయోగాల  కోసం హార్డ్ కాపీని ప్రింట్ తీసుకొని ఉంచుకోండి


జీతం
ఛానెల్ మేనేజర్ ఫెసిలిటేటర్ ఎనీటైమ్ ఛానెల్‌లు (CMF-AC): నెలకు రూ. 36,000 
రిపోర్టింగ్ అథారిటీ: ఛానెల్ మేనేజర్ సూపర్‌వైజర్ (CMS)
ఛానెల్ మేనేజర్ సూపర్‌వైజర్ - ఎనీటైమ్ ఛానెల్‌లు (CMS-AC): నెలకు రూ. 41,000 
రిపోర్టింగ్ అథారిటీ: AGM (AC) నెట్‌వర్క్
సపోర్ట్ ఆఫీసర్ - ఎనీటైమ్ ఛానెల్స్ (SO-AC): నెలకు రూ. 41,000 
రిపోర్టింగ్ అథారిటీ: AGM (AC) నెట్‌వర్క్/AGM (S&P)

Latest Videos

click me!