ఇలా లాగిన్ అవ్వాలి
ఎస్‌బిఐ పిఓ ప్రీ రిజల్ట్ 2021ని ఆన్‌లైన్‌లో చెక్ చేయడానికి అర్హులైన అభ్యర్థులు ఇచ్చిన బాక్స్‌లో రోల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, టెక్స్ట్ వెరిఫికేషన్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్‌బిఐ పిఓ ప్రిలిమినరీ పరీక్ష 20, 21, 27 నవంబర్ 2021 తేదీలలో దేశవ్యాప్తంగా వివిధ షిఫ్ట్‌లలో నిర్వహించారు. ప్రకటన ప్రకారం ప్రభుత్వ బ్యాంకుల్లో 2,056 ఖాళీలను భర్తీ చేయడానికి SBI రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. CrPD/PO/2021-22/18. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, గ్రూప్ ఎక్సర్సైజ్‌లు, ఇంటర్వ్యూ ప్రక్రియలలో పొందిన మార్కుల ఆధారంగా అభ్యర్థి ఎంపిక ఉంటుంది.