ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే, 10+2 (12వ తరగతి) లేదా దానికి సమానమైన కోర్సు పూర్తి చేసి ఉండాలి. కనీసం 6 నెలల కంప్యూటర్ డిప్లొమా/సర్టిఫికెట్ కూడా ఉండాలి. MS Word, MS Excel, MS Power Point లాంటివి బాగా రావాలి.
వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. OBC వాళ్ళకి 3 సంవత్సరాలు, SC/ST వాళ్ళకి 5 సంవత్సరాలు, PwBD (జనరల్/EWS) వాళ్ళకి 10 సంవత్సరాలు, PwBD (SC/ST) వాళ్ళకి 15 సంవత్సరాలు, PwBD (OBC) వాళ్ళకి 13 సంవత్సరాలు వయోపరిమితిలో రిలాక్సేషన్ ఉంటుంది.