ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనకంటూ ప్రత్యేక స్థానం ఉండాలన్నా, కేరీర్ సాఫీగా సాగిపోవాలన్నా.. కొన్ని స్కిల్స్ అవసరం. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మారితేనే కెరీర్‌లో వృద్ధి ఉంటుంది. కొన్ని ఆన్ లైన్ కోర్సుల ద్వారా మన కేరీర్ ని బెటర్ గా మార్చుకోవచ్చు.
ప్రస్తుతం మనకు అనేక ఆన్‌లైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మనల్ని మనం బెటర్ చేసుకోవడానికి ఇవి చక్కగా సహాయపడతాయి. తక్కువ టైంలో, తక్కువ ఖర్చుతో.. ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా వీటిని నేర్చుకోవచ్చు. మీ కెరీర్‌ని వృద్ధి చేసుకోవచ్చు. మరి మీ కేరీర్ కి ఉపయోగపడే ఉత్తమ ఆన్‌లైన్ కోర్సుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
28
డిజిటల్ మార్కెటింగ్- Digital Marketing
ప్రస్తుతం మీరు చేస్తున్న ఉద్యోగం బోర్ కొడుతుంటే, మీ రంగాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించండి. ప్రస్తుతం దాదాపు ప్రతి పరిశ్రమలో డిజిటల్ మార్కెటింగ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇది సోషల్ మీడియా, SEO (సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్), ఇమెయిల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్ వంటి వాటిని కవర్ చేస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల మార్కెటింగ్ రంగంలో మీరు కెరీర్‌ని వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
38
ప్రాజెక్ట్ మేనెజ్ మెంట్- Project Management
ప్రతి వ్యాపారానికి ప్రాజెక్టు మేనెజ్ మెంట్ గురించి తెలిసిన వ్యక్తులు అవసరం. ఈ కోర్సు ద్వారా అనుకున్న టైంకి, అనుకున్న బడ్జెట్‌లో పనిని ఎలా ప్లాన్ చేయాలి? ఎలా పూర్తి చేయాలి వంటి విషయాలు నేర్పుకోవచ్చు. ఇది చాలా మంచి స్కిల్. ఈ కోర్సు పూర్తిచేయడం ద్వారా మంచి ఉద్యోగం పొందవచ్చు. లేదా ప్రమోషన్ పొందే అవకాశాలు మెరుగుపడతాయి.
డేటా విశ్లేషణ అంటే ఒక నిర్ధిష్ట ప్రయోజనం కోసం డేటాను పరిశీలించి అర్థం చేసుకోవడం, నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించడం. ఎక్సెల్, స్ప్రెడ్‌షీట్‌లతో పనిచేయడం, సమస్యలను పరిష్కరించడం మీకు నచ్చితే.. డేటా అనాలిసిస్ నేర్చుకోవచ్చు. ఇది వ్యాపారం, ఆరోగ్య సంరక్షణ, ఫైనాన్స్ వంటి రంగాలలో ఉపయోగపడుతుంది. మీరు మీ కెరీర్‌లో ఎదిగే కొద్దీ ఎక్కువ జీతం పొందవచ్చు.
58
డేటా సైన్స్ - Data Science
డేటా సైన్స్.. డేటా విశ్లేషణ కంటే ఒక అడుగు ముందుంటుంది. ఇందులో పెద్ద మొత్తంలో డేటాను అధ్యయనం చేయడానికి శాస్త్రీయ పద్ధతులు, అల్గారిథమ్ వంటి వాటిని ఉపయోగిస్తారు. ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఎలా జరిగింది వంటి విషయాలను తెలుసుకుంటారు. వ్యాపారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మీకు ఇప్పటికే కంప్యూటర్ సైన్స్ లో అనుభవం ఉంటే డేటా సైన్స్ ఈజీగా నేర్చుకోవచ్చు.
AI మనం జీవించే, పనిచేసే విధానాన్ని మారుస్తోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ చాలా కంపెనీలు AI లో నిపుణుల కోసం చూస్తున్నాయి. AI నేర్చుకోవడం ద్వారా కేరీర్ వృద్ధి చెందుతుంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. టెక్ రంగంలో ముందుకు సాగవచ్చు.
78
కోడింగ్ కోర్సెస్- Coding Courses
నేటి డిజిటల్ ప్రపంచంలో కోడింగ్ ఒక కీలకమైన నైపుణ్యం. మీరు పైథాన్, జావా లేదా HTML వంటి ప్రోగ్రామింగ్ భాషలను నేర్చుకోవచ్చు. ఇందులో మీకు అస్సలు అనుభవం లేకపోతే.. కోడింగ్ నేర్చుకోవడానికి, దానిపై పట్టు సాధించడానికి కొంత సమయం పడుతుంది. కానీ అందుకు తగిన ఫలితం కచ్చితంగా ఉంటుంది. మీరు కోరుకున్న జీతం పొందవచ్చు.
88
సైబర్- Cyber security
ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీకి ఎప్పుడూ లేనంత డిమాండ్ ఉంది. ఆన్‌లైన్ భద్రత ఒక ముఖ్యమైన సమస్యగా మారింది. సైబర్ దాడుల నుంచి కంప్యూటర్‌లు, డేటా, నెట్‌వర్క్‌లను ఎలా రక్షించుకోవాలో ఈ కోర్సులు మీకు నేర్పిస్తాయి. ఇది వివిధ రంగాల్లో బలమైన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది.