సెంట్రల్ బ్యాంక్ ఎస్‌ఓ (SO) రిక్రూట్‌మెంట్ 2021 నోటిఫికేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది, ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 214. ఇప్పుడు వీటికి దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీని డిసెంబర్ 30 వరకు పొడిగించారు. మరింత పూర్తి సమాచారాన్ని inb.centralbank.net.inలో యాక్సెస్ చేయవచ్చు.
అంతకుముందు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 17 డిసెంబర్ 2021. అయితే 16 డిసెంబర్ 2021న విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు ఇప్పుడు 30 డిసెంబర్ 2021 వరకు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించవచ్చు అని తెలిపింది అలాగే అన్ని ఇతర షరతులు అలాగే ఉంటాయని సూచించింది.
అభ్యర్థులు పరీక్ష కోసం కాల్ లెటర్‌ను 11 జనవరి 2022 డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ 22 జనవరి 202

ఆన్‌లైన్ పరీక్ష తేదీ 22 జనవరి 2022
సెంట్రల్ బ్యాంక్ ఎస్‌ఓ రిక్రూట్‌మెంట్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి
పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు inb.centralbank.net.in నుండి దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకొని ఆపై దరఖాస్తు ఫారమ్‌ను నింపల్సి ఉంటుంది
అలాగే, దరఖాస్తు ఫారమ్‌ను నింపేటప్పుడు అభ్యర్థులు ఫోటోగ్రాఫ్, సంతకం ఇతర డాక్యుమెంట్ వంటివి అప్‌లోడ్ చేయాలి.
అభ్యర్థులు పేరు, ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, ఇతర అవసరమైన సమాచారాన్ని కూడా పూరించాలి.
దరఖాస్తు ఫారమ్ నింపిన తర్వాత, అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ.850 చెల్లించాలి.
డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ వంటి ఆన్‌లైన్ మోడ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు.
అభ్యర్థులు భవిష్యత్ కోసం దరఖాస్తు ఫారమ్ కాపీని డౌన్ లోడ్ చేసుకొవాలని సూచించారు.
సెంట్రల్ బ్యాంక్ ఎస్‌ఓ రిక్రూట్‌మెంట్ ఖాళీ వివరాలు
CBI రిక్రూట్‌మెంట్ డేటా సైంటిస్ట్/CM-స్కేల్ IV, ఫైనాన్షియల్ అనలిస్ట్/మేనేజర్-స్కేల్ II, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/AGM-స్కేల్ V, ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఇతర పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అంతేకాకుండా విడుదల చేసిన అధికారిక నోటీసు ప్రకారం రిక్రూట్‌మెంట్ కోసం రెండు కొత్త కేటగిరీలు జోడించింది. అవి- క్రెడిట్ ఆఫీసర్ స్కేల్-II అండ్ ఎకనామిస్ట్ స్కేల్-II. పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు 30 సెప్టెంబర్ 2021 నాటికి కనీసం 20 ఏళ్ల నుండి 35 ఏళ్లు మించకూడదు. అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి అధికారిక నోటిఫికేషన్ చదవాలని సూచించారు.