
చాలామందికి మంచి చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని ఉంటుంది. ఇంజినీరింగ్ లేదా ఏదైనా డిగ్రీ అయిపోగానే విదేశాలకు వెళ్లడానికి రెడీ అవుతారు. అలా చదువు కోసం వెళ్లి అక్కడే సెటిల్ అవ్వాలని చాలామంది అనుకుంటారు. మన దగ్గర్నుంచి కూడా ఏటా ఎంతోమంది యంగ్ స్టర్స్ విదేశాలకు వెళ్తున్నారు.
కొందరు స్టూడెంట్స్ సరైన గైడెన్స్ లేక విదేశాలకు వెళ్లిన తర్వాత ఇబ్బంది పడుతుంటారు. అందుకే మనం ఏ దేశానికి వెళ్తున్నాం..? అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి..? ఏ కాలేజీలు ఉన్నాయి..? అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అక్కడ చదువుకోవడం ఎలా..? చదువు అయిపోయాక జాబ్స్ ఎలా ఉంటాయి..? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుని వెళ్తే మంచిది.
ఇప్పటివరకు భారతీయులు కొన్ని దేశాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువు పూర్తి చేసి ఉద్యోగాలు చేస్తున్నారు. కొత్తగా విదేశాలకు వెళ్లాలనుకునే స్టూడెంట్స్ కూడా ఇలాంటి దేశాలను ఎంచుకుంటే మంచిది. మనవాళ్లు ఆల్రెడీ ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది. మొత్తానికి 2025లో చదువు, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లేవాళ్లు ఈ 10 దేశాలకు ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు.
అమెరికా:
భారతీయ విద్యార్థుల డ్రీమ్ కంట్రీ అమెరికా. మనవాళ్లు చదువు, ఉద్యోగం కోసం ఎక్కువగా అమెరికాకే వెళ్తున్నారు. అక్కడ ఫేమస్ హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ లాంటి యూనివర్సిటీల్లో చదవాలని కలలు కంటారు. ప్రపంచంలో చాలా పవర్ఫుల్ కరెన్సీ ఉన్న యూఎస్ఐలో జాబ్ వస్తే తమ ఎకనామికల్ స్టేటస్ మరింత బాగుంటుందని నమ్ముతారు. అందుకే ఇండియాలో మంచి జాబ్స్ ఉన్నా వదిలేసి అక్కడికి వెళ్తున్నారు.
ఇలా చదువు, ఉద్యోగం కోసం ఇండియా నుంచి అమెరికాకు వెళ్లేవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. స్టూడెంట్స్‌కు చదివేటప్పుడే పార్ట్ టైమ్ జాబ్ చేసే ఫెసిలిటీ కూడా ఉంది... చదువు అయిపోయాక అక్కడే జాబ్ చేసి సెటిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి 2025లో కూడా చాలామంది అమెరికా వెళ్లడానికి రెడీ అవుతున్నారు.
జర్మనీ :
భారతీయులు ఎక్కువగా ఉండే దేశాల్లో జర్మనీ కూడా ఒకటి. ఇక్కడ ఇంజినీరింగ్, ఐటీ, సైన్స్ ఫీల్డ్స్‌లో మంచి టాలెంట్ ఉన్నవాళ్లకు మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే మంచి చదువుల కోసం స్టూడెంట్స్‌కు ఇక్కడికి వెళుతుంటారు. తక్కువ ఖర్చుతో మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ఎకనామికల్‌గానూ జర్మనీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. దీనివల్ల ఆ దేశానికి వెళ్లే భారతీయుల సంఖ్య ఈ సంవత్సరం కూడా ఎక్కువే ఉంది.
ఆస్ట్రేలియా :
ప్రపంచంలో మంచి యూనివర్సిటీలు ఉన్న దేశాల్లో ఆస్ట్రేలియా కూడా ఒకటి. అందుకే విదేశాల నుంచి ముఖ్యంగా ఇండియా నుంచి ఇక్కడ మంచి చదువుల కోసం ఎక్కువగా వెళ్తున్నారు. ఇంకా ఆస్ట్రేలియాలో మంచి లైఫ్ స్టైల్ ఉండటం వల్ల చాలామంది ఇక్కడే సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారు.
కెనడా :
మిగతా దేశాలతో పోలిస్తే కెనడా వెళ్లడం చాలా ఈజీ. చాలా సాఫీగా ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. ఇక్కడ జాబ్ అవకాశాలు కూడా ఎక్కువ. టాలెంట్ ఉన్న ఉద్యోగులను ఈ దేశం ఆదరిస్తుంది. అందుకే ఇక్కడ మన భారతీయులు ఎక్కువగా ఉన్నారు.
బ్రిటన్
మంచి చదువులకు బ్రిటన్ ప్రపంచంలోనే టాప్ ప్లేస్‌లో ఉంది. ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి యూనివర్సిటీలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ చదువు తర్వాత జాబ్ చేసే అవకాశం కూడా ఉంది. అందుకే ఇండియన్ స్టూడెంట్స్ యూకే వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
సింగపూర్ :
సింగపూర్ ఇంటర్నేషనల్ బిజినెస్, ఫైనాన్స్ కు సెంటర్ లాంటింది. ఈ దేశానికి స్ట్రాంగ్ ఎకానమీ ఉంది. మిగతా డెవలప్డ్ కంట్రీస్‌తో పోలిస్తే ఇక్కడ జాబ్స్ సంపాదించడం ఈజీ. మంచి చదువుల కోసం వెళ్లేవాళ్లకు కూడా మంచి అవకాశాలు దొరుకుతాయి.
నెదర్లాండ్ :
ఈ దేశంలో మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. అందుకే ఇక్కడి ఎడ్యుకేషన్ సిస్టమ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇక్కడ చాలా యూనివర్సిటీలు పూర్తిగా ఇంగ్లీష్‌లో కోర్సులు అందిస్తున్నాయి. ప్రపంచ భాష ఇంగ్లీష్‌లో చదువుకోవడం వల్ల ఇక్కడ చదివే స్టూడెంట్స్‌కు ప్రపంచంలో ఎక్కడైనా జాబ్స్ ఈజీగా దొరుకుతాయి. నెదర్లాండ్‌లో జాబ్ అవకాశాలు కూడా బాగానే ఉన్నాయి.
ఫ్రాన్స్ :
ఫ్రాన్స్ సంస్కృతి, కళలు, ఫ్యాషన్‌కు ఇంటర్నేషనల్‌గా ఫేమస్. ఈ ఫీల్డ్స్‌కు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఇంపార్టెన్స్ ఉంది. ఇంకా ఇక్కడి యూనివర్సిటీల్లో ఎడ్యుకేషన్ ఫీజు మిగతా దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది.
ఐర్లాండ్ :
పూర్తిగా ఇంగ్లీష్ మాట్లాడే దేశాల్లో ఐర్లాండ్ కూడా ఒకటి. ఇక్కడ మంచి జాబ్ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ, మెడిసిన్ ఫీల్డ్స్‌లో ఉన్నవాళ్లకు ఐర్లాండ్‌లో మంచి జాబ్ అవకాశాలు ఉన్నాయి.
న్యూజిలాండ్ :
భారతీయులు ఎక్కువగా ఉండే దేశాల్లో న్యూజిలాండ్ కూడా ఒకటి. ఈ దేశం ప్రకృతి అందానికి పేరు పొందింది... కాబట్టి లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. టాలెంట్ ఉన్న ప్రొఫెషనల్ జాబ్స్‌కు ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ ఫీల్డ్స్‌లో ఉన్నవాళ్లకు ఇక్కడకు వెళ్లడానికి ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ చాలా ఈజీగా పూర్తవుతుంది.