అరుదైన ఘటన.. పదహారేళ్ల తరువాత సొంత గుండెను చూసుకున్న మహిళ.. ఆ ఫీలింగ్ గురించి ఏం చెబుతోందంటే...

First Published | May 22, 2023, 12:45 PM IST

ఓ మహిళ గుండెమార్పిడి శస్త్ర చికిత్స జరిగిన 16 సంవత్సరాల తరువాత.. తన అసలు గుండెను చూసుకున్న అరుదైన ఘటన ఒకటి వెలుగు చూసింది.

ఓ మహిళకు 16 సంవత్సరాల క్రితం గుండెమార్పిడి శస్త్రచికిత్స జరిగింది. దీంట్లో భాగంగా ఆమె శరీరం నుంచి తీసిన అసలైన గుండెను ఒక మ్యూజియంలో పెట్టారు. ఆ గుండెను ఆ మహిళ 16యేళ్ల తరువాత చూసుకుంది. ఇది వింతైన రీయూనియన్లలో ఒకటని వార్తలు వెలువడ్డాయి. హాంప్‌షైర్‌లోని రింగ్‌వుడ్‌కు చెందిన జెన్నిఫర్ సుట్టన్, లండన్‌లోని హంటేరియన్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన తన స్వంత అవయవాన్ని చూడటం "నమ్మలేని అధివాస్తవికం" అని పేర్కొంది.

"ఆ మ్యూజియంలోకి అడుగుపెట్టి, దాన్ని చూడగానే నాకు కలిగిన మొదటి ఫీలింగ్.. ఒకప్పుడు నా శరీరంలో భాగం.. నా జీవితానికి ఆధారం అనే ఫీలింగ్ కలిగింది’’ అని చెప్పారామె. అది చూస్తున్నప్పుడు.. "ఈ ఫీలింగ్ చాలా బాగుంది - నా స్నేహితుడిలా అనిపిస్తుంది. నాతోపాటు 22 సంవత్సరాలు ఉంది. నన్ను 22 సంవత్సరాలు బతికించింది. నిజంగా దీన్ని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. నేను నా జీవితకాలంలో ఇలా ఓ సీసాలో భద్రపరిచిన చాలా వాటిని చూశాను.. కానీ ఇది మాత్రం.. నాది అని అనుకోవడం చాలా విచిత్రంగా ఉంది, ”అని ఆమె చెప్పుకొచ్చారు. 


అవయవ దానానికి ఇది మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. ఓ వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఊహించని విచిత్రమైన బహుమతి అన్నారు. తను ఇప్పుడు చురుకుగా, బిజీగా జీవితాన్ని గడుపుతున్నానని "సాధ్యమైనంత కాలం బతకాలనుకుంటున్నానని" ఆమె తెలిపింది. ట్రెక్కింగ్, చిన్న చిన్న వ్యాయామాల లాంటివి చేయడం కూడా తనకు ఇబ్బందిగా ఉందని సుట్టన్ మొదటిసారి కనుగొన్నప్పుడు, ఆమె 22 ఏళ్ల విశ్వవిద్యాలయ విద్యార్థిని. 

వెంటనే డాక్టర్లను కలిస్తే ఆమెకు రిస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి ఉన్నట్లు నిర్ధారణ అయిందని తేలింది. ఇది శరీరం చుట్టూ రక్తాన్ని పంప్ చేసే గుండె సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. దీనివల్ల ప్రమాదం పొంచి ఉంటుంది. గుండె మార్పిడి చేయించుకోకపోతే చనిపోతుందని వైద్యులు చెప్పారు. జూన్ 2007లో, ఆమెకు సరిపోయే గుండె దొరికిందని తెలుసుకుంది.

దీని గురించి సుట్టన్ మాట్లాడుతూ "గుండె మార్పిడి తరువాత అంతా కొత్తగా అనిపించింది. నమ్మలేకపోయాను. నా ఫ్యామిలీకి డబుల్ ధంబ్స్ అప్ చూపిస్తూ నా సంతోషాన్ని వ్యక్తపరిచాను. నేను సాధించాను. నేను సాధించాను.. అని చెప్పడం నాకింకా గుర్తు’ అని జ్ఞాపకం చేసుకున్నారు. ఆ తరువాత సుట్టన్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్‌కు తన గుండెను ప్రదర్శన కోసం ఉపయోగించేందుకు అనుమతించింది. అదే ఇప్పుడు హోల్‌బోర్న్‌లోని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంది

అవయవ దానాన్ని ప్రోత్సహించడానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని తాను కోరుతున్నానని చెప్పారామె. అవయవ దానం వల్లే జీవితంలో అతి ముఖ్యమైన పెళ్లి అనే క్షణాలు తనకు కలిగాయని పేర్కొంది. అవయవదానాన్ని చేయడానికి అందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేసింది. 
 

Latest Videos

click me!