డూమ్స్‌డే.. క్రీస్తు తిరిగొస్తాడని.. ఇద్దరు పిల్లల్ని చంపిన తల్లి.. మరికొంతమంది మాయం....

First Published May 13, 2023, 10:28 AM IST

క్రీస్తు తిరిగి వస్తాడని.. దానికోసం సిద్ధ కావాలంటూ తన 16 ఏళ్ల కుమార్తె టైలీ ర్యాన్, దత్తత కొడుకు ఏడేళ్ల జాషువా "జెజె" వాలోలను చంపిన కేసులు లోరీ వాలో అనే మహిళ దోషిగా తేలింది. 

లాస్ ఏంజిల్స్ : "డూమ్స్‌డే" మత విశ్వాసాలతో యుఎస్ కి చెందిన ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను హత్య చేసింది. ఆ తరువాత తన భర్త మాజీ భార్యను చంపడానికి కుట్ర పన్నింది. ఈ కేసులో శుక్రవారం ఆమె దోషిగా తేలింది.

లోరీ వాలో తన 16 ఏళ్ల కుమార్తె టైలీ ర్యాన్,  ఏడేళ్ల దత్తత  కుమారుడు జాషువా "జెజె"వాలో మరణాల మీద అమెరికాలోని ఇడాహో రాష్ట్రంలో విచారణలో జరిగింది. 

Doomsday

క్రీస్తు రెండవ రాకడ కోసం మానవాళిని సిద్ధం చేసేందుకు ఏర్పడిన దేవత చెప్పబడిన వాల్లో, పెరోల్ లేకుండా జీవితకాలం జైలు శిక్షను ఎదుర్కోబోతోంది.

ఆమె ఐదవ భర్త చాడ్ డేబెల్, అనేక అపోకలిప్టిక్ నవలలు రచించారు. వాటిని స్వయంగా ప్రచురించుకున్న రచయిత. త్వరలో అతను కూడా ఇవే ఆరోపణలపై విడివిడిగా విచారణ జరగనుంది. ఈ ఆరోపణల్లో చాడ్ డేబెల్ మొదటి భార్య టమ్మీ హత్య కూడా ఉంది.

ఈ జంట "మత విశ్వాసాలు" హత్యలకు కారణమని ప్రాసిక్యూటర్‌లు పేర్కొన్నారు. గత సంవత్సరం విడుదలైన నెట్‌ఫ్లిక్స్ ట్రూ-క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్ "సిన్స్ ఆఫ్ అవర్ మదర్"  వీరి కథ ఆధారంగానే తెరకెక్కింది. వాల్లో పిల్లలు అదృశ్యమైన తర్వాత 2019 చివరలో ఈ కేసు జాతీయ వార్తగా మారింది. దీని మీద మొదట జాషువా తాతలు అధికారులకు ఫిర్యాదు చేశారు. 

doomsday

ఆ తరువాత ఇటీవలి సంవత్సరాలలో వాల్లో, డేబెల్‌తో సంబంధం ఉన్న అనేక మంది వ్యక్తులు మరణించారని తెలిసింది. కొన్ని నెలల క్రితం ఆమె హవాయిలో అరెస్టు చేయబడింది. ఆ తరువాత పోలీసు విచారణలో ఒక భయంకరమైన వాస్తవం వెలుగు చూసింది. 

వాలో మూడవ భర్త, జోసెఫ్ ర్యాన్ 2018లో గుండెపోటుతో మరణించారు. అతని కూతురే టైలీ ర్యాన్. ఆ సమయంలో ఆమె తన నాల్గవ భర్త చార్లెస్ వాలో నుండి విడాకులు తీసుకునే పనిలో ఉంది. అతను జూలై 2019లో  తన సోదరుడు జరిపిన కాల్పుల్లో మరణించాడు. అక్టోబర్ 2019లో, డేబెల్ భార్య టమ్మీ సహజంగా మరణించింది. ఆ తరువాత కొన్ని వారాలకు వాలో, డేబెల్ హవాయికి వెళ్లారు. అక్కడ వారు వివాహం చేసుకున్నారు.

అయితే, తమ పిల్లలు తప్పిపోయారని వాలో, డేబెల్ ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. ఇడాహోలోని డేబెల్ కు చెందిన ప్రాపర్టీలో ఆ పిల్లల మృతదేహాలు జూన్ 2020లో దొరికాయి. ఈ కేసు మీద విచారణలో వాల్లో దోషిగా తేలింది. అయితే శిక్ష ఇంకా ఖరారు కాలేదు. అయితే, ఆమెకు మరణశిక్ష విధించొద్దనే దానికి న్యాయమూర్తి అంగీకరించారు.

అయితే, డేబెల్ తన మీద వచ్చిన అన్ని ఆరోపణలకు ఏ మాత్రం గిల్టీగా ఫీలవ్వడం లేదు. దీంతో అతను దోషిగా తేలితే మరణశిక్షను ఎదుర్కోవలసి ఉంటుంది. వాలో, మోర్మాన్‌ విశ్వాసాలు గల వ్యక్తి పెంపకంలో పెరిగింది. కాలక్రమేణా ఆమె మత విశ్వాసాలు  తీవ్రవాద స్తాయికి మారాయి. దేవదూతలతో కమ్యూనికేట్ చేయగలనని నమ్మేది.

2018లో, ఉటాలో జరిగిన ఒక మతపరమైన సమావేశంలో ఆమె డేబెల్‌ను కలుసుకుంది. అతను అంతిమ కాలానికి సిద్ధమవుతున్న రాడికల్ మోర్మాన్ శాఖ నాయకుడు. ఆమె మునుపటి భర్త చార్లెస్ వాలో మాట్లాడుతూ, "క్రీస్తు రెండవ రాకడకు 1,44,000 మందిని సిద్ధం చేయడానికి నియమించబడిన దేవతగా తనను తాను నమ్మేది" అని  పేర్కొన్నాడు.

అపోకలిప్స్ సమయంలో 144,000 మంది విశ్వాసులు స్వర్గంలో శాశ్వతత్వం గడపడానికి పునరుత్థానం చేయబడతారని కొన్ని మతాలు నమ్ముతున్నాయి.

అయితే,  ప్రాసిక్యూటర్లు ఈ నేరాలకు ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. మరణించిన తన పిల్లల కోసం ఉద్దేశించిన సామాజిక భద్రతా ప్రయోజనాలను వాలో.. వారి మృతి సంగతి చెప్పకుండా ఆ డబ్బుల దొంగతనానికి పాల్పడ్డారు. డేబెల్ మీద కూడా భీమా మోసానికి పాల్పడిన ఆరోపణలున్నాయి. 
 

click me!