ప్రపంచంలోని ప్రతి చిన్న గ్రామంలోనూ పిల్లలు పుడుతుంటారు. కానీ ఏకంగా ఒక దేశంలోనే అసలు పిల్లలే పుట్టడం లేదనే వింత విషయం మీకు తెలుసా? వాటికన్ సిటీ పిల్లలు పుట్టని దేశంగా ప్రత్యేకంగా నిలుస్తోంది. అక్కడ జనాభా కేవలం 825 మంది. జనన రేటు సున్నా.
ప్రపంచంలో ప్రతి దేశంలోనూ పిల్లలు పుడతారు. కానీ ఒక దేశంలో ఒక్క బిడ్డ కూడా పుట్టదు. అదే వాటికన్ సిటీ. ప్రపంచంలోనే అతి చిన్న దేశం.
24
సున్నా జనన రేటు
వాటికన్ సిటీ ప్రపంచంలోనే సున్నా జనన రేటు కలిగిన ఏకైక దేశం. అంటే, అధికారిక లెక్కల ప్రకారం ఇక్కడ ఎవరూ పుట్టరు.
34
పౌరసత్వం ఎలా పొందాలి?
మరి జనాభా ఎలా పెరుగుతుంది? అనే సందేహం అందరికీ వస్తుంది కదా.. అక్కడ ఉన్నవాళ్లంతా వలస వెళ్లినవాళ్లే. వాటికన్ సిటీకి వలస వెళ్లాలనుకునే వారికి పోప్ లేదా పాపల్ అధికారి ఆమోదించిన పౌరసత్వం ఉండాలి.
44
పిల్లలు పుట్టారా?
అయతే కొందరు సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో కొంతమందికి పిల్లలు జన్మించారని చెబుతుంటారు. మొదటి వాటికన్ సిటీ బిడ్డ పేరు పియస్ అని మరొకరు తెలిపారు. కానీ దీన్ని ఎవరూ ధ్రువీకరించలేదు.