కోల్ కతా హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మమతా సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇవాళ ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. మమతా సర్కార్ మతపరంగా రిజర్వేషన్ కల్పించలేదని... వెనబడిన వర్గాలకు రిజర్వేషన్ కేటాయించారని తెలిపారు. పశ్చిమ బెంగాల్ లో మైనారిటీలు 27-28 శాతం వుంటారని సిబల్ తెలిపారు.
రంగనాథ్ కమీషన్ ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని సూచించారని సిబల్ గుర్తుచేసారు. అంతేకాదు హిందువుల్లో 66 కమ్యూనిటీలు వెనకబడిన వర్గాలుగా గుర్తించారు... మరి ముస్లింలను అలా ఎందుకు గుర్తించరని అడిగారు. కాబట్టి కోల్ కతా హైకోర్టు తీర్పును రద్దు చేసి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లను పునరుద్దరించాలని కపిల్ సిబల్ సుప్రీం కోర్టును కోరారు.