లావోస్ ప్రెసిడెంట్ కు నరేంద్ర మోదీ గిప్ట్ :
లావోస్ ప్రెసిడెంట్ థోంగ్లన్ సిసూలిత్ కు ప్రధాని మోదీ అరుదైన బుద్ద విగ్రహాన్ని బహూకరించారు. తమిళనాడుకు చెందిన మీనా వర్క్ కళాకారులు ఎంతో నేర్పుతో రూపొందించిన అరుదైన విగ్రహమిది. ఇది దక్షిణ భారత కళా సంపదకు నిదర్శనం.
వివిధ రకాల మెటల్స్ తో అద్భుతమైన కళాకండాలను సృష్టించే మంచి నైపుణ్యంగల కళాకారులకు తమిళనాడు నిలయంగా వుంది. ప్రాచీనకాలం నుండి అనేక కళాకృతులు ఇక్కడ తయారవుతూ వస్తున్నాయి. చోళుల కాలంలో కాంస్యం, ఇత్తడితో నిత్యావసర, అలంకరణ వస్తువులు తయారుచేసేవారు. ఈ క్రమంలో పుట్టుకువచ్చిందే మీనా కళ. తాజాగా ప్రధాని మోదీ ఈ కళాకారులను ప్రోత్సహించేలా, దక్షిణ భారత సుసంపన్న చరిత్రను ప్రపంచానికి తెలియజేసేలా లావోస్ అధ్యక్షుడికి బుద్దుడి విగ్రహం జ్ఞాపికగా ఇచ్చారు.